ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.... తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో ఉందని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.... తెలుగుదేశం పార్టీని ఒక ఆట ఆడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కీలక లీడర్లను తమ పార్టీలో చేర్చుకున్నారు జగన్. అంతేకాకుండా చంద్రబాబు నాయుడును జైలు పాలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ అష్ట కష్టాలను ఎదుర్కొంది. గత ఏడాది కిందటి వరకు అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? లేక జాతీయ పార్టీ అయిన బిజెపిలో విలీనం అవుతుందా ? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.


ఇలాంటి నేపథ్యంలో... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అయింది తెలుగుదేశం పార్టీ. అసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అనే టాక్ తెచ్చేలా కూడా తెలుగుదేశం పార్టీ చేయగలిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో.... ముఖ్యంగా ప్రచారంలో తెలుగు తమ్ముళ్లు దూసుకు వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను  గట్టిగా జనాల్లోకి తీసుకువెళ్లారు తెలుగు తమ్ముళ్లు. ఈ విధంగా వైసీపీ పార్టీని  బుక్కిరిబిక్కిరి చేశారు. అంతేకాకుండా జాతీయ పార్టీ అయిన బిజెపిని కూడా పొత్తుకు ఒప్పించగలిగారు.


ఒత్తులో భాగంగా ఎక్కువ సీట్లు కూడా పొత్తులో భాగంగా... తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు తీసుకొని... జాతీయ పార్టీ అయిన బిజెపి, బలంగా ఉన్న జనసేన పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చారు. ఇందులో చంద్రబాబు పనితీరు బాగుంది. 50 సీట్ల వరకు పోటీ చేయాలనుకున్న జనసేన ను... 21 సీట్లకే పరిమితం చేయగలిగారు. అలాగే ధైర్యంగా చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి కాబోతున్నాడని... కుండ బద్దలు కొట్టి చెప్పగలిగారు.



నరేంద్ర మోడీ అలాగే అమిత్షా లాంటి నాయకులను ఒప్పించి ఏపీకి తీసుకువచ్చారు చంద్రబాబు. ఇటు ఎన్నికల అధికారులు వైసిపికి అనుకూలంగా ఉంటారని అందరూ భావించిన... అక్కడ కూడా తెలుగుదేశం మార్క్ కనిపించింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల అధికారులు పనిచేసేలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర సహాయంతో చంద్రబాబు ఇలా చేశాడని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఇలా అడుగడుగునా తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పుకునేలా ఎదిగింది. అయితే ఈసారి అధికారంలోకి వస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: