ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రెండు నెలల ముందు నుంచే ఎన్నో సర్వేల సైతం పలు రకాల పార్టీలు అధికారంలోకి వస్తాయని తెలియజేయడం జరిగింది.. ఓటింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ.. ఇప్పటికీ కూడా తాజా సర్వేల సైతం పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కూటమికి సపోర్టుగా ఉండగా మరికొన్ని వైసీపీ పార్టీకి సపోర్టుగా వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరొక సర్వే అధికార పార్టీ ఎవరనే విషయాన్ని తెలియజేస్తోంది. వాటి గురించి చూద్దాం.


పొలిటికల్ ఎడ్జ్ ఎగ్జిట్ పోల్ సర్వే.. ప్రకారం ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ 102 సీట్లతో అధికారం చేజిక్కుకుంటుందని తెలియజేస్తున్నారు. అలాగే కూటమిలో భాగంగా 73 సీట్లకు పరిమితం అవుతుందని తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పటికే చాలా సర్వేలు కూడా వైసిపి పార్టీనే అధికారంలోకి వస్తుందని తెలియజేశారు.. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపు జరుగుతోంది. ముఖ్యంగా ఎంప్లాయ్ ఓట్లు కూడా వైసిపి పార్టీకి అనుకూలంగానే పడ్డాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ చేపట్టిన నవరత్నాలు, సంక్షేమ పథకాలు ,స్కూలు బాగోగులు, వైద్య విద్యా వ్యవస్థల మార్పులు కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందని చెప్పవచ్చు.ఇంటి వద్దకే వృద్ధులకు పించిని పంపించడం వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పని కూడా చేయించడం వల్ల ప్రజలు వైసిపి పార్టీ వైపే మొగ్గు చూపారు అనే విధంగా తెలుస్తోంది.  కూటమి కూడా తాము చెప్పినటువంటి ప్రీ బస్, ప్రతి మహిళకు 1500 ప్రతినెల, పింఛన్ 4000 పెంపు, రైతు భరోసా 20 వేలకు పెంపు.. మూడు ఉచిత సిలిండర్లు ప్రతి ఏడాది పంపిణీ చేస్తామని చెప్పడంతోనే మాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి అనే విధంగా అటు కూటమి తెలియజేస్తోంది. అంతేకాకుండా జనసేన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా టిడిపికి కలిసి వచ్చిందని అటు జనసేన కార్యకర్తలు బిజెపి నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో జూన్ 4వ తేదీన చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: