ఒకప్పుడు భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసి పనిచేశారు. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రశాంత్ కిషోర్ విధానాలను అనుసరించింది. ఆ సమయంలో 150 సీట్లు గెలుచుకొని ఏపీ చరిత్రలోనే గొప్ప విజయం సాధించింది. నవరత్నాలు అనే సంక్షేమ పథకాల లిస్టును తయారు చేసింది కూడా పీకే టీమే! అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తానూ, తన సొంత టీమ్ క్రియేట్ చేసిన నవరత్నాలను తప్పుబడుతున్నారు. నవరత్నాల కారణంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వంటి అభివృద్ధి పనులను ఏపీ సర్కార్ చేయలేకపోతోందని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. అయితే వారు చెప్పినట్లే జగన్ చేశారని, ఆయన పాలనను విమర్శిస్తే తమను తాము విమర్శించుకున్నట్లేనని అవుతుందని ప్రశాంత్ కిషోర్ కి తెలిసినా ఆయన అలానే యాంటీ కామెంట్స్‌ చేశారు.

జగన్ పై ద్వేషం పెంచుకున్నారు, ఆయనను ఎలాగైనా తిట్టాలని ఏదో ఒక సాకు చూపి ఏకిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐప్యాక్ టీమ్‌ అనేది ప్రశాంత్ కిషోర్ కు 20% రాయల్టీ ఇవ్వాల్సి ఉంటుందని ఒక రిపోర్టు తెలిపింది. ఐప్యాక్ టీమ్‌కి బాగానే డబ్బులు వస్తాయి. వైసీపీ లాంటి పార్టీలకు పనిచేయడం ద్వారా వారు డబ్బులు సంపాదిస్తారు. ప్రశాంత్ ఈ టీం నుంచి వేరుపడ్డారు. ఐప్యాక్ టీమ్‌ నుంచి రావాల్సిన 20% మనీని ప్రశాంత్ పొందడం కోసం జగన్ ఆశ్రయించారు. ఎందుకంటే జగన్ ఐప్యాక్ టీమ్‌ను హైర్‌ చేసుకున్నారు.  తనకు రావాల్సిన 20% ముందుగానే ఇవ్వాలని జగన్ వద్ద ప్రశాంత్ కిషోర్ ఒక డిమాండ్ వినిపించారట.

అయితే "ఐప్యాక్ టీమ్‌, మీ మధ్య బిజినెస్ పరంగా లేదా చట్టబద్ధంగా ఎలాంటి డీల్ ఉందో నాకు తెలియదు, నేను ఆ టీమ్‌కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తా. ఆ తర్వాత మీరు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. నేను మీ మధ్య ఇన్వాల్వ్ కావడం సరికాదు." అని జగన్ ప్రశాంత్ కిషోర్ తో నిర్మొహమాటంగా చెప్పారట.  దాంతో ప్రశాంత్ కిషోర్ బాగా డిసప్పాయింట్ అయ్యారట. అంతేకాదు జగన్ పై కోపం పెంచుకొని ఆయనపై మాటల దాడులు చేయడం మొదలుపెట్టారు.

అయితే చంద్రబాబు. ప్రశాంత్‌ కిషోర్ కారణంగానే జగన్ గెలిచారని బాగా నమ్మారు. వీరి మధ్య గొడవ జరిగిందని తెలిపాక వెంటనే ఆయనను తనువైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. డబ్బుల కోసం ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి వెంటనే ముందుకు వచ్చారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే ప్రశాంత్ కిషోర్ కి పేరు వస్తుంది, ఆయన టీం మళ్లీ తెరపైకి వస్తుంది. వైసీపీకి రుషి టీం సపోర్ట్ చేస్తోంది, రాబిన్ శర్మ టీం కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ రెండు టీమ్స్ మధ్య ప్రశాంత్ కిషోర్ సర్వైవ్ కావాలంటే ఏదో ఒక పార్టీ విజయం తన ఖాతాలో వేసుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: