ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాట చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది.. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నేతలు రెండవసారి తమదే గెలుపు అని ఇప్పటికే ప్రమాణ స్వీకారం రోజుని ఫిక్స్ చేశామని కూడా తెలుపుతున్నారు. దీంతో అటు కూటమిలో కాస్త కన్ఫ్యూజన్ కూడా మొదలయ్యింది.. ఈ సస్పెన్స్ కు పూర్తిగా తెరలేపాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతున్నది.


పిఠాపురం తో పోలిస్తే చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఓటమి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. అందుకు  తగ్గట్టుగానే వై నాట్ 175 ఆపరేషన్ లో భాగంగా కుప్పం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే కుప్పం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన జగన్ చంద్రబాబు కంచుకోట ను బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చర్చనీయాంశంగా మారుతోంది.


కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందుకు నిదర్శనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత చంద్రబాబు మెజారిటీ నెమ్మదిగా తగ్గుతూనే వస్తోంది. ఆయన గ్రాఫ్ కూడా పడిపోతూ వస్తోంది. ఈసారి దొంగ ఓట్లను కూడా భారీగా తొలగించిన నేపథ్యంలో సమీకరణాలు కూడా మారుతున్నాయని సమాచారం. ఏడుసార్లు కుప్పం ప్రజలకు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏమి చేయలేదని అంతకుమించి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ అక్కడ భారీ ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో కుప్పం రూపురేఖలు కూడా మారిపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగని పనులను కూడా జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు. దీంతో ఏకంగా ఇప్పుడు 89.88 శాతం వరకు ఓటింగ్ నమోదయింది. ముఖ్యంగా చంద్రబాబు కు జైలుకు వెళ్లడం కూడా కొంతమేరకు ఓటమికి ప్రధాన కారణంగా కూడా మారేలా ఉన్నది. మరి చంద్రబాబు కోటను బీటలు చేస్తారేమో చూడాలి మరి వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: