మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అందులో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగింది. ఇక టీడీపీ , జనసేన , బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఎలక్షన్ లకి ఒక రోజు ముందు వరకు ఈ రెండు వర్గాలు ప్రచారాలను జోరుగా ముందుకు సాగించాయి. మేము అధికారం లోకి వస్టే చాలా మంచి పనులు చేస్తాము అని కూటమి ప్రజలు చెప్తే , ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది.

మరో ఐదు సంవత్సరాలు కూడా మాకే ఇస్తే మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇకపోతే మే 13 వ తేదీన ఎలక్షన్ లు ముగిసాయి. ఈ సారి పోయిన సారి కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. దానితో ప్రజలు మా కోసం ఓటు వేశారంటే , మా కోసం ఓటు వేశారు అందుకే ఇంత శాతం ఓటింగ్ జరిగింది అని ఇరు వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఎలక్షన్ ల అనంతరం అంతా సైలెంట్ అయిపోయిన సందర్భంలో ఒక ఈవెంట్ లో భాగంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాము.

పోయిన సారి కంటే ఎక్కువ స్థానాలలో గెలుపొంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పుతం అని ఆయన చెప్పారు. ఇకపోతే జగన్ అంత కాన్ఫిడెన్స్ గా ఆ మాట చెప్పడానికి ప్రధాన కారణం ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో శ్రద్ధతో సంక్షేమ పథకాలను ఇవ్వడమే అని తెలుస్తుంది. ఈయన సంక్షేమ పథకాలను పొందిన ప్రతి ఒక్కరు మళ్ళీ వైసీపీ కే ఓటు వేస్తారు అని దానితో రాష్ట్రం లోని ఎంతో మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినట్లు వారంతా ఓటు వేయడం ద్వారా మళ్లీ ఆమె అధికారం లోకి వస్తాము అని జగన్ భావిస్తున్నట్లు అందుకే అంత ధైర్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆయన కాన్ఫిడెన్స్ మరియు నిజం అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: