ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి.. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంతో చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ప్రత్యేకత ఏమిటో తెలిసిపోతుంది. పదేళ్ల తర్వాత టిడిపి జనసేన బిజెపి పొత్తు పెట్టుకొని మరి ఈసారి బరిలోకి దిగాయి. ఎప్పటిలాగే వైసిపి పార్టీ ఒంటరిగానే పోటీలో నిలబడింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసిపి ఈసారి ఒంటరిగా లేమని ప్రజలతో మా పొత్తు అన్నట్టుగా తెలియజేశారు. ఎన్నికలు అనంతరం ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన భార్యతో కలసి లండన్ కి వెళ్లిపోయారు.


జూన్ 1 గాని తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. జూన్ 4వ తేదీన ఫలితాలు అనుకూలంగా వస్తే మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అవడం ఖాయం. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు తన భార్య భువనేశ్వరి తో కలిసి అమెరికాకు వెళ్లారు. తిరిగి చంద్రబాబు వచ్చేది కూడా ఎప్పుడు అనే విషయం తెలియలేదు. అయితే ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాలలో ఆసక్తికంగా మారిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పోలింగ్ అనంతరం వారణాసిలో ప్రధాన మోడీ నామినేషన్ కి వెళ్లారు. ఆ తర్వాత తన భార్య అన్న లేసినోవాతో కలిసి ఆలయాలను సందర్శించారు..  అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు.

బహుశా పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండలలో ప్రచారం చేసిన పవన్ చాలా నీరసించిపోయారని అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా చుట్టూ ముట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగోలాగా మే 13 వరకు పోరాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ కి చేరిపోయారు. పిఠాపురంలో జనసేన కోసం పోరాడిన చాలామంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వీరికి ధన్యవాదాలు కూడా చెప్పలేదని నిరుత్సాహంలో ఉంటున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ ఒక లేఖను రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: