ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014వ సంవత్సరం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో మొదటి సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో చంద్రబాబు అధ్యక్షతన పోటీలోకి దిగిన తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని నెలకొల్పే స్థాయి సీట్లను దక్కించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. బాబు కూడా రాష్ట్రానికి రాజధాని లేదు అని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకొని దానిని డెవలప్ చేయడానికి కొన్ని కట్టడాలను కూడా కట్టించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని పథకాలను కూడా తీసుకువచ్చారు.

అంతా బాగానే ఉంది 2019 వ సంవత్సరం ఎలక్షన్లు వచ్చాయి. ఇక ఈ ఎలక్షన్లలో బాబు మరోసారి కూడా గెలుస్తాడు అని తెలుగుదేశం నేతలు , కార్యకర్తలు భావించారు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి నుండి చాలా పకడ్బందీగా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు వెళ్లడం కోసం వాలంటీర్ సిస్టమ్ ను రూపొందించి వాటి ద్వారా ప్రజలు ఎలాంటి పథకం కోసం కూడా బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే అన్ని సహాయాలు అందే విధంగా చూశాడు.

అలాగే నాడు నేడు కార్యక్రమం పేరుతో స్కూల్స్ ని డెవలప్ చేయడం , రైతులకు , మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం , అలా దాదాపు రాష్ట్రంలో ఉన్న ఎన్నో వర్గాల ప్రజలకు ఆయన సంక్షేమ పథకాలను అందించారు. దానితో ఈయనపై ప్రజలకు మంచి బావన ఉంది. అలాగే జగన్ మళ్ళీ సీఎం కావాలి అని కూడా ఎక్కువ శాతం జనాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల పైనే జనాలకు వ్యతిరేకత ఉన్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. దానితో చాలా వరకు జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వాళ్లకు సీట్లు ఇచ్చాడు. అయినప్పటికీ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల ద్వారానే జగన్ కి కాస్త దెబ్బ తగలనన్నట్లు , ఆ ఒక్కటి పక్కన పెడితే జగనే మళ్లీ సీఎం కావాలి అని ప్రజలు ఎక్కువ శాతం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: