ప్రెసెంట్ ఏపీలో ఎన్నికల హడావిడి ఏవిధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఏపీ లో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక రాష్ట్రంలో ఇంకా ఎన్నికల హడావిడి ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పలుచోట్ల 144 సెక్షన్ కొనసాగుతుంది.  కోడ్ అమల్లో ఉండగా అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు గాని కార్యక్రమాలు లేదా ప్రారంభోత్సవాలకు హాజరవ్వకూడదని ఎన్నికల నిబంధనలో ఉంది. అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ఫోటోలు మరియు పోస్టర్లు కనిపించకూడదని ఈసి ఇప్పటికే ఉద్దేశించింది.

అయితే నగిరిలో ఈసీ ఉద్దేశాలను ఉల్లంఘించారు. టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కోడ్ ఉల్లంఘించారు. ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే ఈసీ నిబంధనలకు ఆపోజిట్ గా గాలి భాను ప్రకాష్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. చిత్తూరులో బ్యాడ్మింటన్ కోర్ట్ నీ భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఈయన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే భాను ప్రకాష్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ల పై ఎమ్మెల్యే రోజా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిగణిస్తూ గాలి బాను ప్రకాష్ పై కేసు నమోదు చేశారు.

రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో.. భాను ప్రకాష్ చిక్కుల్లో పడ్డాడు. ఎన్నికల ఫలితాలు రిలీజ్ కాకముందే అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇక దీనిని అవకాశంగా తీసుకుని వైసిపి వారు రెచ్చిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికలు జరిగాయి. ప్రత్యర్థులపై పోటాపోటీగా ప్రచారం చేపడుతూ తమదైన రీతిలో కష్టపడ్డారు. ఇక కొంతమంది అభ్యర్థులు ఎంత కష్టపడినప్పటికీ చాలా చిన్నచిన్న పొరపాటులతో చెడ్డ పేరును ముద్ర వేసుకున్నారు. ఆ లిస్టులో తాజాగా భాను ప్రకాష్ కూడా చేరారు. ఇప్పటివరకు ఎంతో సైలెంట్ గా ఉన్న ఈయన కేవలం ఫ్లెక్సీలతో నెగెటివిటీని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: