•వైసీపీ కంచుకోటనే బద్దలు కొట్టిన బీటెక్ రవి


•చంద్రబాబుకి కుడి భుజంలా మారిన బీటెక్ రవి..


* అధికారంలోకి వచ్చేది తామే..


(కడప - ఇండియా హెరాల్డ్ )
కడప.. వైసిపి పార్టీ కంచుకోట.. అలాంటి ఆస్థానాన్ని ఎవరు చెరపలేరు అనే వార్తలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి.. కానీ అతి సామాన్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకాలోనే గెలుపు చూపించి ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపించారు బీటెక్ రవి.. అసలు అక్కడ టిడిపి గెలవడం అసాధ్యం అన్న అనుమానంలో ఉండగా టిడిపిని అధికారంలోకి తీసుకురావడంతో టిడిపి పార్టీకి ఎంతో ఊరట కలిగింది.. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత కడపలో 2017 స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.. దాంతో పులివెందులలో కూడా తామే గెలుస్తామని అప్పటి సీఎం చంద్రబాబు నుంచి టిడిపి నేతల వరకు ఆనందం వ్యక్తం చేశారు.. 2017లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి నిలబడినప్పటికీ వైసీపీ అక్కడ గెలవలేకపోయింది.. ఇది జగన్ కు  గట్టి షాక్ అనే చెప్పాలి .. జగన్ ఇలాకాలో గెలిచేందుకు టిడిపి వ్యూహాత్మకంగా పావులు కదిపి.. వైఎస్ కంచుకోట ను నాడు బద్దలు కొట్టింది..

ఇక నేడు ఎలాగైనా సరే మళ్లీ తమ పార్టీ కనుమరుగు అయిపోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు అండగా నిలుస్తూ.. మళ్లీ జగన్ అనే  కొండను ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు బీటెక్ రవి అలియాస్ మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి..ముందుగా ఈయన గురించి తెలుసుకుంటే టిడిపి తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి 2017 లో విజయం సాధించిన ఈయన ఇంటర్ వరకు పులివెందులలోనే చదివి కర్ణాటకలో బీటెక్ పూర్తి చేశారు. గత 25 ఏళ్లుగా టిడిపిలోనే కొనసాగుతున్న ఈయన 2011లో జరిగిన ఉప ఎన్నికలలో పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గెలుపొందారు.. ఇక అయితే కడప ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటెక్ రవికి టిడిపి అవకాశం ఇవ్వగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటాపోటీగా తలపడి విజయాన్ని దక్కించుకున్నారు.

టిడిపిని ఈసారి మట్టి కరిపించాలని ప్రయత్నం చేస్తోంది వైసిపి. ఇక అందులో భాగంగానే చంద్రబాబు ఒంటరి అయిపోవడంతో ఆయన గెలవడం కష్టమేనని వార్తలు వినిపిస్తూ ఉండగా వ్యూహాత్మకంగా రచనలు చేసి అటు బిజెపి ఇటు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అయినా సరే ఓటమి కష్టం అంటూ వార్తలు వినిపిస్తూ ఉండగా సొంత నియోజకవర్గంలోనే జగన్ ను  ఓడించడానికి సిద్ధమయ్యారు టిడిపి నేత బీటెక్ రవి. ఇక రానున్నది రామ రాజ్యం అని పులివెందుల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి ఇప్పుడు స్పష్టం చేశారు.. కులం చూడము మతం చూడము అని చెప్పి అధికారంలోకి వచ్చి కులం మతం చూసే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న దుర్మార్గుడు జగన్ అని ఇక చంద్రబాబుకు తాను అండగా ఉంటానని చంద్రబాబుకి నష్టం కలిగించే పని ఏదైనా చేస్తే తనను దాటుకొని వెళ్ళలనీ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుకి లక్ష్మణ రేఖగా తాను ఉంటానని
.. అరాచక పాలనకు చరమగీతం త్వరలోనే పాడుతామని స్పష్టం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: