జూన్ 4న వెలువడే ఎలక్షన్ల ఫలితాలు కోసం నాయకులతో పాటుగా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోంది. మరోసారి వైసీపీనే అధికారం చేపడుతుంది అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటుంటే.. ఈ సారి అధికారం మేము చేజిక్కించుకోబోతున్నాం అని కూటమి వర్గాల నుండి వెలువడుతున్న మాట. ఇక వీరి స్టేట్మెంట్లకు జూన్ 4న చెక్ పడనుంది. అది కాస్త పక్కనబెడితే ఈసారి కూడా జగన్ అధికారంలోకి ఎందుకొస్తాడు అనే అంశంపైన రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఎక్కువ పాజిటివ్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు అని అంటున్నారు. అదే విధంగా అయిదేళ్ళ పాటు పంచిన ఉచిత పథకాలకు జనాల నుంచి వచ్చిన భారీ రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నారు. అయితే బయట వాతావరణం వేరుగా ఉన్నట్టు కనబడుతుందని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. కీలక సెక్షన్లు అన్నీ యాంటీగా ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు లక్షలలో ఉన్నారు. వారు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యధిక శాతం కూటమికే పడింది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాదు వారి కుటుంబ సభ్యుల ఓటింగ్ కూడా అటే అని అంటున్నారు.

మరోవైపు యాంటీ యువత ఈసారి గంపగుత్తగా కూటమికే ఓటు వేసింది అని చెబుతున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని జాబ్ కాలెండర్ భర్తీ చేయలేదని కోపంతో వ్యతిరేక ఓటింగ్ చేశారు అని గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఏది ఏమైనా కూడా ఒకవేళ ఈసారి కూడా జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏమిటన్న అంశం ఇపుడు చాలామంది మదిలో మెదులుతుంది. ఈ సారి జగన్ వస్తే తన పరిపాలన మొత్తం విశాఖపట్నం సముద్రతీరం నుండే మొదలు పెట్టనున్నాడనే విషయం స్వయంగా వారే చెబుతున్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఉచిత పధకాలపైన దృష్టి పెట్టిన జగన్ ఈసారి ఏపీ అభివృద్ధి కోసం కంకణం కడతారని వైసీపీ వర్గాలు ఘోషించి మరీ చెబుతున్నాయి. ఏమో ఏదైనా జరగొచ్చు... దానికోసం అయితే ఇంకా మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: