ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం అనేది జూన్ 4వ తేదీన బయటకు రానుంది.  ఇదే తరుణంలో ఓవైపు టీడీపీ కూటమి మరోవైపు వైసీపీ మేం గెలుస్తామంటే మేము గెలుస్తామని గట్టిగానే చెబుతున్నారు. కానీ ఈసారి రాష్ట్రంలో చాలా రసవత్తర పోరు అయినట్టు తెలుస్తోంది.  దీనికి ప్రధాన కారణం టిడిపి జనసేన మరియు బిజెపితో పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు. ఈ పొత్తు వల్ల బిజెపి జనసేన ఓట్లు కూడా టిడిపికి పడి విజయం సాధిస్తామని ఆయన భావిస్తున్నారట. ఇదే తరుణంలో వైసిపి సింగిల్ గా పోటీ చేసినా,  పోటీ మాత్రం గట్టిగానే ఇచ్చింది. ఏది ఏమైనా గెలుపు ఓటమి అనేది రెండు పార్టీల మధ్య తప్పనిసరిగా ఉంటుంది. 

ఎవరో ఒక్కరు మాత్రమే గెలవాలి. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే మాత్రం  పార్టీ అంతా మోడీ కనసన్నాల్లోకి వెళ్తుందని బిజెపి వాళ్లు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం  జనసేన, బిజెపితో పొత్తు అనేది కడుపులో కత్తులు లోపల నవ్వులు  అనే విధంగా పాటిస్తున్నారు. కేవలం ఏపీలో గెలవడం కోసమే  ఆయన పొత్తు పెట్టుకున్నారని బిజెపి పై ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదని అంటున్నారు. అంతేకాకుండా మోడీ కూడా చంద్రబాబును ఏ కోణాన కూడా నమ్మరు. కేవలం పైకి మాత్రమే నవ్వుతూ కలిసి ఉన్నట్టు నటిస్తున్నారు కానీ ఆయన మనసులో ఉండేది మనసులోనే ఉంది.  పోయిన ఎన్నికల్లో ప్రధాని ఎన్నిక సమయంలో ఎన్డీఏ కూటమికి చంద్రబాబు సపోర్ట్ చేసినట్టే చేసి చివరి వరకు హ్యాండ్ ఇచ్చారు. మోడీని ప్రధాని చేయవద్దని నితిన్ ఘట్కారినే ప్రధానిగా ప్రకటిస్తే నేను సపోర్ట్ చేస్తానని చెప్పకనే చెప్పేశారు.

అప్పటినుంచి మోడీ చంద్రబాబు మధ్య కాస్త వైరం పెరిగింది. ఇదే తరుణంలో 2024 ఎలక్షన్స్ లో చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం, చంద్రబాబు తనకు అవసరం వచ్చిన పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తారని మోడీకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు.  ఏది ఏమైనా  మోడీ చంద్రబాబులు పైకి నవ్వుకుంటున్న కడుపులో కత్తులు పెట్టుకొని ఉన్నారని అంటున్నారు.  అందుకే మోడీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ప్రచారం చేసిన సమయంలో కూడా ఏమాత్రం జగనును  విమర్శించలేదు.  దీన్నిబట్టి చూస్తే మాత్రం మోడీకి చంద్రబాబు కంటే జగన్ అంటే ఎక్కువ ఇష్టమని తెలుస్తోంది.  చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే మాత్రం మోడీకి తప్పకుండా మొండిచేయి చూపిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: