ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.... అందరూ ఎంతో ఆతృతగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసినా ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇక తెలుగుదేశం అలాగే వైసిపి కార్యకర్తలు నేతలు...అయితే ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కూడా కాస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు కొంతమంది జోరుగా ప్రచారం చేయడమే కాకుండా భారీ స్థాయిలో బెట్టింగులు కాస్తున్నారు.


కాదు కాదు కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ముళ్లు, జనసేన కార్యకర్తలు కూడా జోరుగా బెట్టింగ్లు చేయడం నిత్య మనం వార్తలు చూస్తున్నాము. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల గెలుపు పై ఆసక్తికర చర్చ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నెలకొంది. కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి వైయస్ షర్మిల బరిలో ఉన్నారు. అటు వైసిపి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ రసవత్తర పోరు జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి విజయం కోసం స్వయంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రంగంలోకి దిగి ప్రచారం చేశారు.


ఇటు వైఎస్ షర్మిల మాత్రం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మాత్రమే వాడుకొని పాపులర్ అయ్యే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఎన్నిసార్లు చురక లాంటి ఇచ్చిన కూడా వైయస్ షర్మిల మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం ఉందని ఆరోపణలు చేస్తూ జనాల్లోకి వెళ్లారు. ఇటు వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతమ్మను కూడా ప్రచారం కోసం వాడుకుంది షర్మిల. చిట్టచివరి రోజున వైయస్ విజయమ్మ కూడా షర్మిలకు ఓటు వేయాలని పిలుపునిచ్చింది. అయితే కడప జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే కీలక లీడర్లు మాత్రం వైఎస్ షర్మిలకు ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదట.


ఇన్ డైరెక్ట్ గా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డికి తమ సపోర్టు ఉంటుందని... తెలంగాణకు వెళ్లి ఇక్కడికి వచ్చిన షర్మిలకు ఓటు వేయకూడదని కాంగ్రెస్ నేతలు కొంతమంది అనుకున్నారట. రహస్యంగా సమావేశాలు కూడా పెట్టుకున్నారట. ఓటింగ్ రోజున ఓటు కూడా కాంగ్రెస్కు కాకుండా వైసిపికి ఓటు వేసినట్లు చర్చ జరుగుతోంది కడప జిల్లాలో..!దానివల్ల వైఎస్ షర్మిలకు భారీ ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు... ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది. కాంగ్రెస్ నేతలే వైఎస్ షర్మిలకు వెన్నుపోటు పొడిచారని అందరూ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: