ఏపీలో 100లో 70 మంది కూటమి అధికారంలోకి రావచ్చని చెబుతుండగా 30 మంది వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. అయితే జగన్ ధైర్యం మాత్రం కూటమిని గజగజా వణికిస్తోంది. జగన్ చెప్పిన మాటలు పూర్తిస్థాయిలో నిజం కాకపోయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని కూటమి నేతలు భయపడుతున్నారు. జగన్ కు రాజకీయాలు కొత్త కాదు. గెలుపోటములు కొత్త కాదు.
 
ఎన్నో సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఎదురు కాగా వాటిని అధిగమిస్తూ జగన్ ముందడుగులు వేయడం జరిగింది. జగన్ కు చాలామంది నేతలతో పోలిస్తే రాజకీయ అనుభవం తక్కువ. అయితే ప్రజలకు మంచి చేయాలని ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే మంచి ఆలోచన మాత్రం జగన్ లో ఎప్పుడూ ఉంటుంది. పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019లో వైసీపీని జగన్ అధికారంలోకి తీసుకొచ్చారు.
 
మౌనంతోనే జగన్ సంచలనాలు సృష్టిస్తే మాత్రం మరో 30 ఏళ్లు ఏపీకి తానే సీఎం అని భావిస్తున్న జగన్ కల సులువుగానే నెరవేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2019లో వైసీపీ సాధించిన సీట్లు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అయ్యాయి. జగన్ చరిత్ర సృష్టించారని ఏపీ ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడం అయితే సులువు కాదు.
 
అయితే జగన్ 100 స్థానాలలో సులువుగానే విజయం సాధిస్తారని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు. 2004, 2009, 2019 ఎన్నికల ఫలితాల సమయంలో చంద్రబాబు భారీ సంఖ్యలో స్థానాల్లో విజయం దక్కుతుందని భావించగా ఆయన నమ్మకం నిజం కాలేదు. పవన్ కు సైతం ఈ ఎన్నికల్లో గెలుపు సులువు కాదని వంగా గీత గెలిచినా షాకవ్వాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ నమ్మకం నిజమవుతుందో కూటమి నేతల నమ్మకం నిజమవుతుందో చూడాల్సి ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: