ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసింది. ఇవ‌న్నీ కూడా.. నిజానికి పార్టీల ప‌రంగా ప‌క్క‌న పెడితే.. పోల్ మేనేజ్ మెంటు తెలిసిన వారు.. రాజ‌కీయంగా ఉద్ధండులు.. అనుభ‌వం ఉన్న వారే ఉన్నారు. కొణ‌తాల రామ‌కృష్ణ‌, ఆర‌ణి శ్రీనివాసులు, బొమ్మిడి నాయ‌క‌ర్‌, పుల‌ప‌ర్తి రామాంజ‌నే యులు.. ఇలా.. చాలా మంది నాయకులు మంచి అనుభ‌వం ఉన్న‌వారే. ఇక‌, పిఠాపురంలో ప‌వ‌న్ కోసం.. డ‌జ‌న్ల సంఖ్య‌లో నాయ‌కులు తెర‌చాటున చ‌క్రం తిప్పారు.


సో.. మొత్తానికి 21 స్థానాల్లో 17 - 19 చోట్ల గెలుపు గుర్రం ఎక్కేందుకు చాన్స్ ఉంద‌ని చెప్ప‌డం వెనుక ఇదీ రీజ‌న్‌. ఇదే క‌నుక సాధిస్తే.. ప‌వ‌న్ గ‌ట్టి విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టే.. రాబోయే సంవ‌త్స‌రాల‌కు ఆయ‌న పార్టీని బలంగా నిల‌బెట్టుకున్న‌ట్టే అవుతుంది. అయితే.. ఈ సీట్ల సంగ‌తి ఎలా ఉన్న‌ప్పటికీ.. ఒక కీల‌క స్థానంపై మాత్రం పెద్ద‌గా ఎవ‌రూ దృష్టి పెట్ట‌లేదు. దీంతో ఆ స్థానం ఓడిపోయే ప‌రిస్థితిలో ఉంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.


అదే.. నెల్లిమ‌ర్ల‌. ఇక్క‌డ  నుంచి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన లోకం మాధ‌విని ప‌వ‌న్ సెల‌క్ట్ చేసు కున్నారు. అయితే.. వాస్త‌వానికి ఇక్క‌డ ఆ సామాజిక వ‌ర్గం ఓట్లు పెద్ద‌గాలేవు. అయినా.. ప‌వ‌న్ మాత్రం ఆమెను ఎంపిక చేసి ఇచ్చారు. ఐటీ వ్యాపారాల్లో ఎదిగిన వ్య‌క్తి కావ‌డంతో డ‌బ్బుల‌కు లోటు లేక‌పోవ‌డంతో మాధ‌వికి టికెట్ ఇచ్చార‌నే వాద‌న ఉంది. ఇంత వ‌ర‌కు బాగానేఉన్నా.. స్థానికంగా వైసీపీకి బ‌లం ఎక్కువ‌. పైగా.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. పైగా ఇక్క‌డ నుంచి బొత్స మేన‌కోడ‌లి భ‌ర్త బ‌డ్డుకొండ అప్ప‌ల నాయుడు పోటీ చేశారు. ఆయ‌న గ‌తంలోనూ ఓ సారి ఎమ్మెల్యే గా గెలిచారు.


దీంతో స‌హ‌జంగానే వైసీపీ గాలులు వీచాయి. చివ‌రి రోజు అంటే..ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు రోజు.. కూడా.. బొత్స హ‌వానే క‌నిపించింది. నియోజ‌క‌వ‌ర్గంలో బొత్స అనుచ‌రులు ఎక్కువ‌గా వైసీపీకి ప‌నిచేశారు. పోల్ మేనేజ్ మెంట్‌.. న‌గ‌దు పంపిణీ వంటి కీల‌క విష‌యాల్లో వారు చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌రిణామం స‌హ‌జంగానే జ‌నసేన‌కు ఒక సీటును త‌గ్గించింద‌నే వాద‌న‌ను వినిపిస్తోంది. సో.. ఈ సీటు ప‌క్కాగా కోల్పోతార‌ని.. 20 స్తానాల్లో 18-19 వ‌రకు గెలిచేందుకు అవ‌కాశం ఉంద‌ని టాక్ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: