ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో  వైసిపి మరియు టిడిపి కూటమి మధ్య హోరాహోరీ పోటీ సాగినట్టు తెలుస్తోంది. కానీ చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉందని అంటున్నారు. అంతేకాదు వైసిపి అధినేత జగన్ కూడా  తానే అధికారంలోకి రాబోతున్నానని బాహాటంగానే చెప్పారు.  టిడిపి కూటమి అధినేత చంద్రబాబు మాత్రం ఎన్నికలు జరిగినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కొంతమంది వైసీపీ నాయకులు  బాబు భయపడుతున్నారని, ఆయన జగన్ ట్రాప్ లో పడ్డారని అంటున్నారు.  నిజానికి జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడలేదు. చంద్రబాబు వ్యూహంలోనే జగన్ ఇరుక్కున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. 

ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈ పరిస్థితులను గమనించిన చాలామంది  వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. అధికారులు మాకు సపోర్ట్ చేయలేదనే తీరును వ్యక్తపరుస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ కు ఎన్నికల అధికారులు సపోర్ట్ చేయలేదు అంటే  దాని వెనుక చంద్రబాబు పెద్ద వ్యూహమే పన్నారు అనేది వారికి తర్వాత అర్థమైంది. ముఖ్యంగా వైసిపికి ఎక్కువ పట్టు ఉన్నటువంటి అనంతపురం, చిత్తూరు, పల్నాడు, జిల్లాల్లో  చంద్రబాబు తన బలం బలగంతో సాధ్యం కాని పనులను  అధికారుల అండతో సాధ్యం చేశారు. గోవర్ధన్ రెడ్డి, పేర్ని నాని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి  పెద్దపెద్ద నేతలు కూడా ఈసీ పైనే విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఈసీని ఏమాత్రం తప్పు పట్టడం లేదు.

చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకున్నారు అంటే చంద్రబాబు జగనును కట్టిడి చేయడం కోసమే, వ్యూహం పన్నారని, దాన్ని అధికారులు విజయవంతంగా ముగించారని తెలుస్తోంది. అందుకే ఆయన బిజెపితో పొత్తు పెట్టుకున్నారని, బిజెపితో పొత్తు వల్ల  కొన్ని ముస్లిం మైనారిటీ ఓట్లు తనకు పడవని తెలిసినా పొత్తు పెట్టుకున్నది  జగన్ ను కట్టడి చేయడానికే అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆమాత్రం గొడవలు లేకుండా వన్ సైడ్ ఓటింగ్ జరగకుండా వైసిపి  నాయకులను కట్టడి చేసి ఈసీని, పోలీసు అధికారులను తన వైపు తిప్పుకున్నారు. ఇక చంద్రబాబు నిర్ణయం వల్ల పోలింగ్ మాత్రం చక్కగా జరిగింది కానీ  ప్రజలు ఏ వైపు ఓటు వేశారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రిజల్టు ఏ వైపు వస్తుంది అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: