గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. వైసిపి అభ్యర్థి కిలారి రోశయ్య, టీడీపీ అభ్యర్థి పెమ్మసాని మధ్య పోటీ రసవత్తరంగా సాగింది.గుంటూరులో దశాబ్ద కాలంగా జరగాల్సిన అభివృద్ధి జరగలేదనే సంగతి తెలిసిందే.తెలుగుదేశం పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికలు అత్యంత ముఖ్యంగా మారాయి. ఈ పార్లమెంటు పరిధిలో గుంటూరు ఈస్ట్, వెస్ట్ , తెనాలి,ప్రతిపాడు, తాటికొండ పొన్నూరు,మంగళగిరి  నియోజకవర్గాలు ఉన్నాయి.గుంటూరు ఈస్ట్లో ముస్లిం ఓట్లు బాగా ప్రభావితం చేస్తాయి. అలాగే మిగిలిన ఐదు నియోజకవర్గాలలో కమ్మ, కాపు ఓట్లు గెలుపోటములను డిసైడ్ చేస్తాయి.ప్రతిపాడు, తాడికొండ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు.2014లో 79.2 % 2019 ఎన్నికల్లో 79.21%, తాజా ఎన్నికల్లో 78.81% పోలింగ్ నమోదయింది. తాడికొండలో అత్యధికంగా పోలింగ్ నమోదయితే తక్కువగా గుంటూరు వెస్ట్లో నమోదయింది.అమరావతే రాజధానిగా పరిపాలన చేస్తాం అనే అంశంతో టీడీపీ భారీగా ప్రచారం చేసింది.

అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు మూడు రాజధానులు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వైసిపి ఎన్నికల క్యాంపెయిన్ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన అందాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.పార్టీల ప్రతిష్ఠ కంటే గుంటూరు లో అభ్యర్థులు ఎంత దూకుడు పెంచారన్నదే ప్రధానం అని అక్కడి ప్రజలు అంటున్నారు. అందుకే టీడీపీ, వైసిపి అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ప్రచారంలో గుంటూరు రూపురేఖలు మరుస్తానంటూ పెమ్మసాని హామీ ఇచ్చారు. అలాగే వైసిపి అభ్యర్థులను మారుస్తూ వస్తూ చివరికి కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారీ రోశయ్యగా టికెట్ ఇచ్చింది. గత రెండు ఎన్నికల్లో జయదేవ్ టిడిపి తరపున గెలిచి విజయం సాధించారు.

ఈసారి కూడా గెలిచి టీడీపీ హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఉంది. దానికి అనుగుణంగానే కిరాలిని కాదని ఈసారి కూడా టీడీపీ అభ్యర్థి పెమ్మసాని పట్టంకట్టే దిశగా అక్కడి ప్రజలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దానికి ప్రధాన కారణం టీడీపీ ఎత్తిన అమరావతి అంశం స్థానికంగా రాజధాని అంటే అనే విధంగా పెమ్మసాని, సంక్షేమ పథకాల లబ్ధి పేరుతో వైసీపీ కష్టపడుతోంది. స్థానికంగా ఉన్న ఎస్సీ, బీసీ ఓట్లు వైసీపీకి అనుకుంగా ఓట్లు వేస్తే వైసిపి ఖచ్చితంగా గెలుస్తుంది అని తెలుస్తుంది. ఏదేమైనా అటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్షపార్టీ రెండు కూడా గెలుపే లక్ష్యంగా తీస్కొని పోటీ పడ్డారు. మరీ ప్రజలు ఎవరిని ఆమోదించారో జూన్-4 న తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: