ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి యూరప్ వంటి పర్యటనలకు వెళ్లారు. చివరిగా రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఐప్యాక్ దీంతో భేటీ అయి మాట్లాడిన తర్వాతే విదేశాలకు వెళ్లిపోయారు. గతంలో గెలిచిన 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువగానే వస్తాయంటూ తెలియజేశారు. దీంతో అటు వైసీపీ నేతలలో క్యాడర్ కి కూడా జగన్ పైన ఉన్న ధీమాతోనే చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలోనే జగన్కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ లో వైసీపీ ఎన్నారై నేతలతో భేటీ అయ్యారు.


అయితే అక్కడ భేటీ అయిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం అందర్నీ కలకలాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. వైసిపి ఎన్నారై నేతలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏజీ పొన్నవోలు మాట్లాడుతూ కన్నీటి పర్వతం కూడా అయ్యారు. చివరికి అక్కడున్న నేతలు కూడా ఆయనని సర్ది చెప్పడం జరిగింది. ఎన్నారైలు చేసిన సహకారం అద్భుతంగా ఉందని రాబోయే రోజుల్లో మరింత ముందుకు కూడా కొనసాగించాలని తెలియజేశారు. అంతేకాకుండా జగన్ గారు చాలా ప్రమాదంలో ఉన్నారని అందరూ జగన్ ను అనుమానిస్తున్నారని..అవమానిస్తున్నారని కూడా తెలియజేశారు.


ఈ సమయంలో కచ్చితంగా అందరూ ఏకమై జగన్ మద్దతుగా నిలవాలని కూడా తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులలో కూడా రాజశేఖర్ రెడ్డి పేరును చార్జి సీట్లో పొన్నవోలు చేర్పించారని కూడా గతంలో వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికలలో భాగంగా మాట్లాడిందని  తెలిపారు. ఈ విషయానికి పొన్నవోలు కూడా కౌంటర్ వేశారు. ప్రస్తుతం పొన్నవోలు చేసిన వ్యాఖ్యలు వైసిపి నేతలను అభిమానులను సైతం ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎవరిని నమ్మాలో తెలియడం లేదంటూ కూడా పొన్నవోలు కీలకంగా మాట్లాడారు. పేదల కోసం ఆయన్ని కచ్చితంగా కాపాడుకోవాలని.. ఆయన ప్రమాదంలో ఉన్నారని తెలిసినప్పటికీ జగన్ వినేవారు కాదని ఏదైతే అదవుతుందని నమ్మేవారని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: