మే 13వ తేదీన అటు ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. అయితే ఇక ప్రజలు ఎటువైపు నిలిచారు. ఈసారి ఎవరిని ముఖ్యమంత్రి చేయదలిచారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది  ఇదే విషయంపై అటు బెట్టింగ్ రాయుళ్ళు కూడా రెచ్చిపోతూ వాళ్లు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అంటూ తెగ బెట్టింగులు వేసేస్తున్నారు. దీంతో ఆంధ్రలో ఎక్కడ చూసినా కూడా నెక్స్ట్ సీఎం ఎవరు అనే విషయం గురించి చర్చ జరుగుతుంది. అయితే తమ సంక్షేమ పథకాలే తమను గెలిపించబోతున్నాయని రెండోసారి అధికారాన్ని చెదికించుకోబోయేది తామే అంటూ అటు వైసిపి నేతలు బల్లగుద్ది మరి చెబుతున్నారూ.


 జగన్ కూడా రెండోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. కానీ సీఎం జగన్కు సొంత ఇలాకాలోనే భారీ షాక్ తగలబోతుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగానే పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట అన్న విషయం తెలిసిందే. ఈసారి సీఎం జగన్కు భారీ మెజారిటీ వస్తుందని పార్టీ నేతలు అంచనాలు పెట్టుకోగా.. ఫ్యాన్ పార్టీ అంచనాలు తారుమరూ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు అని చెబుతున్నారు.


 2019 ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్కు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. కానీ 93000 ఓట్ల ఆదిక్యతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక ఇప్పుడు జగన్ సీఎం గా ఉండడంతో ఆ మెజారిటీ భారీగా పెరుగుతుందని అంచనాలు పెట్టుకోగా..  ఈసారి మెజారిటీ తగ్గబోతుందట. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.. బాబాయి వివేక హత్య కేసును నీరు కార్చారని చెడ్డ పేరు. ఇక నిందితుడిగా ఉన్న వైయస్ అవినాష్ రెడ్డికి మళ్ళీ ఎంపీ సీటు కేటాయించడంపై ఉన్న అసంతృప్తి.. ఇక వైయస్  కుటుంబానికి చెందిన జగన్ సొంత చెల్లి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం.. ప్రచారంలో పదేపదే వివేక హత్య కేసును జగన్ నీరుగార్చారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక షర్మిల ప్రజల్లోకి వెళ్లడంతో.. పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చిందట. ఇక టిడిపి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా వైసిపి ఓట్లను చీల్చారని.. తద్వారా జగన్ విజయం సాధించిన ఊహించినంత మెజారిటీ రావడం కష్టమే అన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: