ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పిఠాపురంలో ఎవరు గెలుస్తారా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇతనిపై వైసీపీ అభ్యర్థి వంగా గీతను జగన్ బరిలోకి దింపారు. వీరిద్దరి మధ్య పోటీ బాగానే నెలకొన్నది. ఎవరు గెలుస్తారనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. బెట్టింగ్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన మద్దతుదారులు కార్యకర్తలు "పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా" అనే స్టిక్కర్స్ వేయించుకుంటున్నారు.

తమ పవన్ ఎమ్మెల్యేగా గెలిచినట్లే, ఆయన పేరు చెప్పుకొని గర్వంగా తిరిగేస్తాం అన్నట్లు వీరు షో చేస్తున్నారు. పవర్ స్టార్ బొమ్మ కూడా బండ్లపై ప్రింట్ చేయించుకుంటున్నారు. అయితే వీరికి వైసీపీ వాళ్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వారు కూడా తమ బండ్లపై తమదైన శైలిలో స్టిక్కర్స్ వేయిస్తున్నారు. డిప్యూటీ సీఎం వంగా తాలూకా అంటూ వైసీపీ వాళ్లు బండ్లపై స్టిక్కర్స్ ముద్రిస్తున్నారు. ఎవరికివారు ఇలా అభిమానాన్ని చాటుకుంటున్నారు డిప్యూటీ సీఎం అని ఎందుకు స్టిక్కర్లు రాయిస్తున్నారంటే జగన్ ఆమె పిఠాపురంలో గెలిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.

సో ఆ విషయాన్ని వీళ్ళు హైలెట్ చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ స్టిక్కర్లు అంటిస్తే అంటించారు కానీ వెహికల్ నెంబర్ కనిపించకుండా చేస్తున్నారు. ఇది ఆర్టీవో చట్టం ప్రకారం గెలుద్దాం దీనివల్ల పోలీసులు వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా అభిమానాన్ని చాటుకునే క్రమంలో వీళ్ళు చట్టాన్ని బ్రేక్ చేస్తున్నారు. జూన్ నాలుగో తేదీన పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది తేలుతుంది. ఆయన ఓడిపోతే పవన్ అభిమానులకు భారీగా షాక్ తగుల్తుంది. ఒకవేళ కూటమి గెలిచిన పవన్ కి మంచే జరుగుతుంది. పార్టీతో పాటు ఇతను కూడా ఓడిపోతే పొలిటికల్ కెరీర్ కు శుభం కార్డు పడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: