ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీ 2019 లో అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా అని చెప్పవచ్చు.. ఈ సోషల్ మీడియా ని టచ్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా వైసిపి పార్టీకి సంబంధించి ఎలాంటి చిన్న విషయాన్ని అయినా సరే తెగ వైరల్ గా చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా ట్రోల్ చేస్తే వారు క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టరు.. ముఖ్యంగా ఎంతటి వారినైనా సరే వైసీపీ సోషల్ మీడియా మాత్రం వదిలిపెట్టదు.. జగన్కు క్రేజ్ రావడానికి ముఖ్య కారణం కూడా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


అయితే ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియా లో పనిచేసే వారందరూ కూడా ఒక్క రూపాయి ఆశించకుండానే పనిచేసినట్టుగా తెలుస్తోంది. కేవలం 2024 ఎన్నికల ముందు వైసిపి సోషల్ మీడియా తో మాట్లాడి ప్రశంశాలు సైతం కురిపించారు.. అయితే ఆ తర్వాత ఎన్నికలు కూడా జరిగాయి. ఇప్పుడు తాజాగా నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై.. ఎవరిని ఉద్దేశించి కాకుండా వైసిపి తరపున కష్టపడిన వారందరి కోసం అభ్యర్థనలు చేస్తోంది. శ్రీరెడ్డి విడుదల చేసిన ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..


వైసిపి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి జీతాలు రావడం లేదని.. అందరూ తమకు జీతాలు రావడం లేదు అక్క అంటూ అడుగుతున్నారని.. యూట్యూబర్స్ కూడా పార్టీ కోసం చాలానే కష్టపడుతున్నారని.. వారికి కూడా జీతాలు రావడంలేదని.. ఆడపిల్లలు బ్రతుకులు రోడ్డుపైకి వచ్చాయన్న అంటూ ఈ వీడియోలో తెలియజేస్తుంది ఇలా వారి జీవితాలు రోడ్లపైకి వచ్చాక కూడా మీరు రెస్పాండ్ కాకపోతే మాలాంటి వాళ్ళు బ్రతికి వేస్టు అంటూ ఈ వీడియోలో తెలియజేసింది. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయం పైన సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: