ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ సపోర్ట్ చేయకుండా ఉండాలని బీజేపీకి ఏపీ సీఎం జగన్ ఎన్నోసార్లు చెప్పి చూశారు. కానీ ఈ కాషాయ పార్టీ మాత్రం టీడీపీతో చేతులు కలిపి వైసీపీపై పోటీ చేసింది. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆ పార్టీని ఓడించేందుకు చాలానే ప్రయత్నం చేసింది. టీడీపీ అడిగిందల్లా చేస్తూ వైసీపీకి నానా ఇబ్బందులు కలిగించింది. వ్యవస్థలను, ఎన్నికల సంఘాలను, పోలీసులను ఇలా ప్రతిదీ మేనేజ్ చేయడంలో చంద్రబాబుకు మోదీ బాగా సహాయం చేశారు. బీజేపీ అండతో ఎలక్షనీరింగ్ లో చంద్రబాబు వైసీపీ పై చేయి సాధించారు. జగన్ కోసం పనిచేసే, జగన్‌కు అండగా ఉన్న ఉన్నతాధికారులందరినీ బదిలీ చేయించారు.

ఇవన్నీ చూస్తున్న జగన్‌లో బీజేపీపై తీవ్ర అసహనం పెరిగిపోయింది. బీజేపీ కారణంగా ఎన్నికలు సవ్యంగా జరిగేటట్లు కనిపించడం లేదు అని పరోక్షంగా మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మాత్రం కూటమిదే విజయం అని అనుకుంటూ జగన్ ను అసలు లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ గెలుస్తుందేమో అనే భయం వారిలో నెలకొన్నదట. అందుకే జగన్ తో మళ్ళీ స్నేహం చేయాలని బీజేపీ పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది కానీ వైసీపీ మాత్రం ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్‌డీఏ పార్టీ సరిపడా ఎంపీ స్థానాలను గెలుచుకోలేక పోతే జగన్‌ను మోదీ బతిలాడుకోవాల్సి వస్తుంది.

ఆయన తన ఎంపీ సీట్లను ఎన్‌డీఏలో కలపకపోతే మోదీ పీఎం పదవిని వదులుకోవాల్సిందే. ఇండియా కూటమి గెలుపుకు దగ్గరగా వస్తే కచ్చితంగా వారికే జగన్ సపోర్టు చేస్తారట. ఇది మోదీకి మామూలు షాక్ కాదు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా సరే ప్రత్యేక హోదా కల్పించాలి అనే ఒక కండిషన్ను జగన్ పెడతారని తెలుస్తోంది. కేంద్రంలో ఎవరికి సపోర్ట్ అందించినా కాంగ్రెస్ కి మాత్రం జగన్ ఎప్పటికీ తన సపోర్టును ప్రకటించరు. ఎందుకంటే ఆయనను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తుంది  చెల్లి రూపంలో కూడా కాంగ్రెస్ జగన్‌కు పంటి కింద రాయిలా తయారయ్యింది.

అలాగని బీజేపీ ఆయన మొగ్గు చూపుతారా అంటే అలా కూడా జరగదు. కీలక సమయంలో వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీని పెట్టాల్సిన తిప్పలు వైసీపీ తప్పనిసరిగా పెడుతుందని అంటున్నారు. ఈ ఊహగానాలు చేసుకునే ముందు జూన్ 4 వరకు వెయిట్ చేయడం మంచిది అని రాజకీయ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ఆ రోజుతో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: