ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు.... పూర్తయిన నేపథ్యంలో... వీటి ఫలితాలపై అందరి దృష్టి పడింది. మేమంటే మేం గెలుస్తామని.. ఇటు వైసిపి అలాగే అటు తెలుగుదేశం కూటమి నేతలు అంటున్నారు. బెట్టింగులు కూడా చేస్తున్నారు నాయకులు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవకపోతే... ఆ పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోవడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు.

 తెలుగుదేశం ఇప్పటికే ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆర్థిక వనరులు కూడా లేవు. అందుకే ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకే బిజెపి అలాగే జనసేన పార్టీతో కలిసిపోయింది తెలుగుదేశం. మరి ఇంత చేసి ఈ ఎన్నికల్లో ఓడిపోతే..  ఆ పార్టీని కాపాడే నాధుడే లేడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు పైబడిపోయింది. ఆయన మళ్లీ పార్టీని నడపడం అంటే కష్టమే అంటున్నారు. అది పక్కకు పెడితే నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగిస్తే... కష్టమే అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మంగళగిరిలో ఎమ్మెల్యేగా కూడా గెలవాలని పరిస్థితి లో నారా లోకేష్ ఉన్నారు. సరిగా తెలుగు కూడా మాట్లాడ లేని వాడు... పార్టీని ఏం నడుపుతాడని కొంతమంది చెబుతున్నారు.

 ఇలాంటి నేపథ్యంలో.... తెలుగుదేశం పార్టీ ఓడిపోతే... ఆ పార్టీని కాపాడేది ఒకే ఒక్కడు అతడే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పడి చచ్చిపోతారు  జనాలు. అలనాటి సీనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ కంటే జూనియర్ ఎన్టీఆర్కు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.  వైసీపీలో కూడా జూనియర్ ఎన్టీఆర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్... తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకుంటే.. వల్లభనేని వంశీ,  కొడాలి నాని ఇలాంటి కీలక లీడర్లు... అందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే...  2029 వరకు పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి..  ఎలాంటి డోకా లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: