- చంద్ర‌బాబు ద‌గ్గ‌రే ఉత్త‌మాధికారిగా మంచి మార్కులు
- ఉచిత విద్యుత్ అమ‌ల్లో కీ రోల్‌... వైఎస్సార్ మ‌న‌సు దోచిన ఆఫీస‌ర్‌
- నారా లోకేష్ మంత్రిత్వ శాఖ‌కు ముఖ్య కార్య‌ద‌ర్శిగా చ‌క్రం తిప్పిన వైనం

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి అనేక ఆటు పోట్ల మ‌ధ్య ప్ర‌స్తుతం త‌న విధుల ను కొన‌సాగిస్తున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన‌.. జ‌వ‌హ‌ర్‌.. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి విభ‌జిత రాష్ట్రం వ‌ర‌కు ఆయ‌న అనే ప‌ద‌వులు నిర్వ‌హించారు. అలాగే అనేక ముఖ్య‌మంత్రుల వ‌ద్ద కూడా ప‌నిచే శారు. క‌డ‌ప జిల్లాకు చెందిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి.. వృత్తిరీత్యా డాక్ట‌ర్‌. వెట‌ర్న‌రీ వైద్యులుగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌భుత్వ వెట‌ర్నరీ వైద్య శాల‌లోనూ ప‌నిచేశారు.


అయితే.. ఆయ‌న ఐఏఎస్ కావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించి 1990లో ఐఏఎస్ సాధించారు. వాస్తవానికి క‌డ‌ప జిల్లాకు చెందిన వారిలో చాలా చాలా త‌క్కువ మంది ఐఏఎస్‌లు అయిన వారు ఉన్నారు. ఇలా.. జ‌వ‌హ‌ర్ రెడ్డి 1990లో ఉమ్మ‌డి ఏపీలోనే.. ఐఏఎస్ అయ్యారు. గ‌తంలో ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా ఆయ‌న ప‌నిచేశారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఉమ్మ‌డి ఏపీగా ఉన్న‌ప్పుడు.. పాఠ‌శాలవిద్యా శాఖ ముఖ్య కార్య‌ద ర్శిగా ప‌నిచేశారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న అనేక నిర్ణ‌యాలు తీసుకున్నారు.


సంస్క‌ర‌ణ‌లు తీసుకువ చ్చారు. త‌ర్వాత వైఎస్ హ‌యాంలో వ్య‌వ‌సాయ శాఖ‌కు ప‌నిచేశారు. ఈ స‌మ‌యం లో రైతు భ‌రోసా, ఉచిత విద్యుత్ వంటివాటిని వైఎస్ మ‌న‌సెరిగి అమ‌ల‌య్యేలా చేశారు. దీంతో అన‌తి కాలంలోనే ఆయ‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. సీఎంవోలోనూ ఆయ‌న కు ప్ర‌త్యేక స్థానం క‌ల్పించారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. తొలి ఐదేళ్లు చంద్ర‌బాబు వ‌ద్ద ప‌నిచేశారు. విధి నిర్వహణలో ఆయ‌న నిక్క‌చ్చిగా ఉండ‌డం ఆయ‌న‌కు చంద్ర‌బాబు వ‌ద్ద మంచి మార్కులు వేసేలా చేసింది.


అంతేకాదు.. ఒక్క రూపాయి అవినీతి కూడా చేయ‌ని అధికారిగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. దీంతో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఉత్త‌మ అధికారిగా కూడా జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేరు సంపాయించుకున్నారు. ఇక‌,  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌ చూసిన పంచాయతీ రాజ్‌శాఖకు ముఖ్య కార్యదర్శిగా జవహర్‌ రెడ్డిని నియమించారు. అప్పుడు ఆయన అత్యంత సాఫీగా  పనిచేశారు. దీంతో పంచాయ‌తీ రాజ్ శాఖ‌కు అనేక కార్య‌క్ర‌మాలు చేయ‌డం ద్వారా మంత్రి నారా లోకేష్‌కు శ్ర‌మ త‌గ్గించార‌నే చెప్పాలి.


వైసీపీ హ‌యాం వ‌చ్చే స‌రికి.. జ‌వ‌హ‌ర్‌రెడ్డి అదృష్టం మారిపోయింద‌నే చెప్పాలి. ఆయ‌న కోరుకున్న ప‌ద‌వు లు ఇచ్చారు సీఎం జ‌గ‌న్‌. గ‌తంలో త‌న తండ్రి ద‌గ్గ‌ర ప‌నిచేసి ఉండ‌డంతోపాటు.. నిజాయితీ ప‌రుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న నేప‌థ్యంలో జ‌వ‌హ‌ర్‌రెడ్డి అడిగింది అడిగిన‌ట్టు చేసి పెట్టారు. క‌రోనా స‌మ యంలో జ‌వ‌హ‌ర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ‌కు ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో స‌ర్కారు ద్వారా ఆయ‌న చేసిన ప‌నులు దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టారు.


దీంతో సీఎం జ‌గ‌న్‌.. జ‌వ‌హ‌ర్‌రెడ్డికోరిక‌ను మ‌న్నించి.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో గా ఎంతో మంది పోటీలో ఉన్న‌ప్ప‌టికీ.. పంపించారు. ఆ త‌ర్వ‌త‌.. మ‌ళ్లీ అవ‌స‌రం అయి.. ఆయ‌న‌ను వైద్య ఆరోగ్య శాఖ‌కు తీసుకున్నారు. ఇక, సీనియార్టీ జాబితా ప్ర‌కారం.. జ‌వ‌హ‌ర్‌రెడ్డి 2022 నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నారు. నిజాయితీ ప‌రుడిగా.. ఆలోచ‌నా ప‌రుడిగా.. వివాదాల‌కు దూరంగా ఉండే అధికారిగా కూడా.. జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఉమ్మ‌డి ఏపీలో హెడీఎంఏ క‌మిష‌న‌ర్‌గా కూడా ప‌నిచేశారు.


ఎక్క‌డ ప‌నిచేసినా.. ఆయ‌న సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డం.. ప్ర‌భుత్వ అధినేత‌ల‌తోను, మంత్రుల తోనూ క‌లివిడిగా ఉండడం గ‌మ‌నార్హం. ఇన్నేళ్ల స‌ర్వీసులో ఎవ‌రితోనూ ఆయ‌న వివాదాలు పెట్టుకోలేదు. ఎక్క‌డా కూడా.. రూపాయి అవినీతికి కూడా పాల్ప‌డింది లేదు. అదే.. ఆయ‌న‌ను ఈ సంక్లిష్ట ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కాపాడింది. ఎంతో మంది ఆయ‌న‌పై ఫిర్యాదులు చేసినా.. ఎన్నిఒత్తిళ్లు వ‌చ్చినా.. గ‌తంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఎలాంటి వివాదాలు లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ల సంఘం ఆయా ఫిర్యాదుల‌ను సైతం బుట్టదాఖ‌లు చేసింది. కాగా, ఈ ఏడాది న‌వంబ‌రు 30తో జ‌వ‌హ‌ర్ రెడ్డి త‌న ప‌ద‌వి నుంచి రిటైర్ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: