ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన  ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని విషయం ఎవరికి అంత చిక్కడం లేదు. ప్రజలలో కూడా చాలా ఉత్కంఠత రేపుతోంది. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చెప్పుకోవలసిన చారిత్రాత్మకంగా విజయం గానే మిగులుతుందట. ఇలాంటి చరిత్రను సృష్టించడం కేవలం జగన్ కు మాత్రమే సాధ్యమవుతుందంటూ పలువురు వైసీపీ నేతలు చాలా గట్టిగానే నమ్ముతున్నారు. అలా సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019లో మే 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా ఇందిరా గాంధీ స్టేడియంలో దద్దరిల్లిపోయేలా ప్రమాణ స్వీకారం చేశారు.


వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మొదలుపెట్టి గ్రాండ్ గా నీనాలతో దద్దరిల్లిపోయేలా ప్రమాణస్వీకారం చేశారు. 151 యొక్క శాసనసభ స్థానాలతో పాటు 22 లోక్సభ స్థానాలతో వైసిపి పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకున్నది. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి రికార్డును సువర్ణ అక్షరాలతో లెక్కించే విధంగా చేశారు. ఐదేళ్ల పరిపాలన కూడా అలాగే కొనసాగించారు. దీంతో మళ్లీ ఏపీలో సీఎం జగన్ అధికారాన్ని చేపట్టబోతున్నారని విషయాన్ని చాలా ధీమాతో తెలియజేస్తున్నారు వైసిపి నేతలు.గత ఎన్నికలలో కంటే ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో వైసిపి పార్టీ గెలిస్తే ఖచ్చితంగా చారిత్రాత్మకంగా విజయం అవుతుంది.. అలాగే ఎన్నికలలో గెలిస్తే విశాఖ నుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా ప్రకటించారు. మే 30వ తేదీన 2019 న చారిత్రాత్మకం ఘట్టం మరొకసారి జూన్ 9వ తేదీన రిపీట్ కాబోతోంది అనే వార్తలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి రాష్ట్రం మొత్తం వినిపించేలా దేశం దృష్టి ఏపీ వైపు నిలిచేలా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటూ వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. మరి వైసిపి నేతల నమ్మకం నిజమవుతుందా లేదా అనేది జూన్ 4వ తేదీన తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: