ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో... అందరి చూపు ఫలితాల పైన ఉంది. ఎప్పుడు ఫలితాలు వస్తాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠత అయితే నెలకొంది. ఈ వాతావరణం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. అయితే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 

 తెలుగుదేశం పార్టీ నేతలు కూడా... కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. జనసేన పార్టీ నేతలు... ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అంటున్నారు.  అంతేకాకుండా చాలామంది నేతలు.. పార్టీల గెలుపు పై బెట్టింగులు కాస్తున్నారట. వైసిపి గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ పెడితే... కూటమి గెలుస్తుందని మరి కొంతమంది లక్షల్లో బెట్టింగ్లు పెడుతున్నారట.

 

ఈ నేపథ్యంలోనే... ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఓడిపోతుందని కొంతమంది వైసీపీ నేతలు.. బెట్టింగ్ పెడుతున్నారని జనసేన నేతలు  సంచలన ఆరోపణలు చేశారు.తిరుపతి జనసేన నేతలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయంపై సంచల
న వ్యాఖ్యలు చేశారు.  రోజా గెలుస్తూందని కనీసం రోజా అయినా బెట్టింగ్ వేస్తుందా..? అంటూ చురకలు అంటించారు తిరుపతి జనసేన నేతలు.
 

రోజా ఓడిపోతుందని నగరిలో వైసిపి కార్యకర్తలే చెబుతున్నారని.. మరికొంత మంది వైసీపీ నాయకులే బెటింగ్‌ కాస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతలంతా కూటమీ గెలుస్తూందని బెట్టింగ్ వేస్తున్నారని పేర్కొన్నారు. కూటమీ బలమైన మెజారిటీతో గెలుస్తూంది..సజ్జల ట్రాప్ లో వైసిపి కేడర్ పడకండి ఎద్దేవా చేశారు. వైసిపి గెలిస్తే... జనసేనకు రాజీనామా చేసి వైజాగ్ వరకు సిఎం జగన్ కోసం పోస్టర్లు అంటిస్తామన్నారు తిరుపతి జనసేన నేతలు.  సజ్జల పిచ్చిపట్టినట్లు మాట్లాడుతూన్నాడు..ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతి రేకంగా మాట్లాడుతారా..? అని నిల దీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కచ్చితంగా కూటమి గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు తిరుపతి జనసేన నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: