ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పై అన్ని పార్టీలు... ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నాయి. జూన్ 4వ తేదీన... ఫలితాలు ఏ పార్టీ వైపు ఉంటాయో? ఏ పార్టీ ఓడిపోతుందో? ఇలాంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మెదులుతున్నాయి. మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగగా... జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తున్నాయి. అయితే ఫలితాలకు చాలా గ్యాప్ రావడంతో... ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ కూడా సాగింది.


 వైసీపీ గెలుస్తుందని కొంత మంది బెట్టింగ్ కాస్తుంటే....  కాదు కాదు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని మరికొంతమంది జోరుగా బెట్టింగ్ చేయడమే కాకుండా ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మొన్న... సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వస్తున్నామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసి లండన్ కి వెళ్ళిపోయారు.

దీంతో టెన్షన్ లో ఉన్న వైసిపి క్యాడర్... కాస్త రిలాక్స్ అయింది. అటు తెలుగుదేశం పార్టీలో కాస్త టెన్షన్ కూడా మొదలైంది. అయితే తాజాగా నాగన్న సర్వే రిపోర్ట్ కూడా వైసిపి పార్టీకి అనుకూలంగా వచ్చింది. వైసిపి పార్టీకి 118 సీట్లు వస్తాయని నాగన్న సర్వే రిపోర్ట్ లో తేలిందట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు... నాగన్న సర్వే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇలాంటి నేపథ్యంలో...  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు జలకు ఇచ్చేలా లండన్ నుంచి కీలక సందేశం పంపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.


ఏపీలో మళ్లీ మనమే గెలుస్తున్నామని ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు జగన్. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది అంటూ వెల్లడించారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందన్నారు జగన్. దింతో ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: