( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

మూడు దశాబ్దాల నిర్విరామ సర్వీసు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశేషమైన సేవలను అందించారు. 1990, ఆగస్టు 20న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో ప్రొబేషనర్‌గా చేరడంతో అయ‌న‌ ప్రయాణం ప్రారంభమైంది. మూడు దశాబ్దాలకు పైగా ఆయన నిర్విరామంగా సర్వీస్ అందిస్తూ వస్తున్నారు. జవహర్ రెడ్డి అద్భుతమైన టాలెంట్ తో సాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ వివిధ ముఖ్యమైన పదవులను నిర్వహిస్తూ సీఎస్ స్థాయికి చేరుకున్నారు.


జవహర్ రెడ్డి :  హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో ముఖ్య భూమిక ?
తన ప్రతిభావంతమైన కెరీర్‌లో, జ‌వ‌హ‌ర్‌ రెడ్డి అనేక కీలక స్థానాలను చేపట్టారు. ఆయన భూములు కలెక్టర్‌గా, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కార్యదర్శి స్థాయి స్థానాలను చేపట్టారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌కే కాకుండా తెలంగాణ‌కే త‌ల‌మానిక‌మైన హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్‌రోడ్డు లాంటి కీల‌క ప్రాజెక్టులో సమర్థవంతమైన విధానాలను అమలు చేయడం ఆయన ప‌రిపాల‌నా ప్రతిభను ప్రదర్శించింది.


కరోనా మహమ్మారినుండి లక్షలమంది ప్రాణాలు కాపాడిన టీం లో ప్రముఖుడీ జవహర్ రెడ్డి
స్వ‌త‌హాగా డాక్ట‌ర్ కావ‌డంతో 2020లో వ‌చ్చిన క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను కాపాడిన ఘ‌న‌త జ‌వ‌హ‌ర్‌రెడ్డికే ద‌క్కుతుంది. క‌రోనా కేసులు త‌గ్గించేందుకు.. క‌రోనా బాధితుల‌కు వైద్యం అందేలా చేసేందుకు ప్రభుత్వానికి ఎన్నో సలహాలు , సూచనలు చేశారు. వాటిని చాలా వరకు ప్రభుత్వం ఫాలో అయ్యింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో జనాలకు ఎన్నో సదుపాయాలను కల్పించడంలో కూడా ఈయన సలహాలు సూచనలు ఎంతో కీలక పాత్రను పోషించాయి. అలా జగన్ టీం లో చీఫ్ సెక్రటరీగా ఉంటూ జవహర్ రెడ్డి కరోనా సమయంలో ఎంతో క్రియాశీలకంగా పని చేశారు.


మూడు పదులకు పైగా సర్వీసు : తెలుగు జాతి అభివృద్ధిలో తనదైన సంతకం ఈ జవహర్ రెడ్డి
ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. క‌డ‌ప జిల్లాకు చెందిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి.. వృత్తిరీత్యా డాక్ట‌ర్‌. వెట‌ర్న‌రీ వైద్యులుగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌భుత్వ వెట‌ర్నరీ వైద్య శాల‌లోనూ ప‌నిచేశారు. మూడు ద‌శాబ్దాల స‌ర్వీసులో ఒక్క రూపాయి అవినీతి కూడా చేయ‌ని అధికారిగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి జ‌వ‌హ‌ర్‌రెడ్డి సీన్ మారిపోయింది. జ‌గ‌న్ సైతం త‌న తండ్రి ద‌గ్గుర ప‌నిచేసిన అధికారి కావ‌డం... నిజాయితీ ప‌రుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న నేప‌థ్యంలో జ‌వ‌హ‌ర్‌రెడ్డి అడిగింది అడిగిన‌ట్టు చేసి పెట్టారు. క‌రోనా స‌మ యంలో జ‌వ‌హ‌ర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ‌కు ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో స‌ర్కారు ద్వారా ఆయ‌న చేసిన ప‌నులు దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టారు.


జవహర్ రెడ్డి : వైద్యుడే ప్రధాన కార్యదర్శయితే - పేదవాడికి నిండు నూరేళ్ళు
ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో పాటు ఎలాంటి పథకాలను అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందో ఆయనకు పూర్తిస్థాయిలో తెలుసనే సంగతి తెలిసిందే. జవహర్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాగా ఆయన ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ గా పని చేశారు. ఇన్నేళ్ల కెరీర్ లో వేర్వేరు బాధ్యతలను చేపట్టిన జవహర్ రెడ్డి ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. వైద్య నేప‌థ్యం వ‌ల్లే క‌రోనా టైంలో ఆయ‌న ఆలోచ‌న‌ల‌తోనే ప్ర‌భుత్వం చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింది.


గోదావరి - కృష్ణా నీళ్లతో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన hmda కమీషనర్
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన సేవలతో వైఎస్ ని ఎంతగానో మెప్పించారు. అస‌లు జంట న‌గ‌రాలు దాహ‌ర్తితో అల్లాడిపోయేవి. వాటర్ బోర్డు ఎండీగా గోదావరి - కృష్ణా నీళ్లతో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన మహనీయుడు జవహర్ రెడ్డి. అంతేగాక hmda కమీషనర్ గా కూడా తానేంటో నిరూపించుకున్నారు.


పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే తో ఎయిర్ పోర్ట్ ను దగ్గర చేసిన  HMDA కమీషనర్
పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే తో ఎయిర్ పోర్ట్‌ను దగ్గర చేశారు జవహర్ రెడ్డి. భూములు కలెక్టర్‌గా, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కార్యదర్శి స్థాయిలో ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే రంగారెడ్డి జిల్లా, మెయినాబాద్ ప్రాంతంలో హైద‌రాబాద్‌కే త‌ల‌మానికంగా నిలిచిన రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ భూసేక‌ర‌ణ‌లో కీ రోల్ పోషించారు. ప్రతి స్థానంలో ఆయన సంస్కరణలను, సమర్థవంతమైన విధానాలను అమలు చేయడంలో మరియు పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఆయన ప్రతిభ అంతా ఇంత కాదు.


వేలమంది శ్రీకాకుళ వాసుల భవితను మార్చిన మద్దివలస ప్రాజెక్ట్  పూర్తి చేసిన : జవహర్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లాలో ఆయ‌న కెరీర్ తొలినాళ్ల‌లోనే ఎప్ప‌టి నుంచో అతీగ‌తీ లేని కీల‌క‌మైన మ‌ద్దివ‌ల‌స ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుతో వెన‌క‌ప‌డిన ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో రైతుల ద‌శ మార్చి కొన్నేళ్ల పాటు అక్క‌డ నీటి పారుద‌ల అవ‌కాశాల కోసం వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే.


చంద్రబాబే - లోకేష్ శాఖకు ఏరి-కోరి తెచ్చుకున్న సమర్థుడీ రెడ్డి
2017 సంవత్సరంలో నారా లోకేశ్ ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగా చంద్రబాబే ఏరికోరి ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డికి లోకేశ్ శాఖలో పెద్దపీట వేసి కీలక బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబే - లోకేష్ శాఖకు ఏరికోరి జవహర్ రెడ్డిని తెచ్చుకున్నారంటే పరిపాలనలో ఈయన మార్క్ ఏపాటిదో అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: