జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఎలక్షన్లలో తెలుగుదేశం, బిజెపి పార్టీలతో పొత్తులో భాగంగా బరిలోకి దిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్నారు. ఇక ఆయనకు ఇచ్చిన ప్రతి స్థానంలోనూ జనసేన పార్టీ గెలవడంతో ఈయన క్రేజ్ కూటమిలో అదిరిపోయే రేంజ్ లో పెరిగింది. ఇకపోతే మొదటి నుండి కూడా తెలుగు దేశం , బిజెపి లను కలపడంలో పవన్ కీలక పాత్ర పోషించాడు.

ఇక కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమికి కలిసి రావడంతో పవన్ పై వారికి కూడా ఎక్కడలేని అభిమానం పెరిగిపోయింది. దానితో మొదటి నుండి చంద్రబాబు క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అని , ఆయనకు అత్యంత కీలకమైన మంత్రి పదవులు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. ఇక మొదటి నుండి ఈయనకు డిప్యూటీ సీఎం పదవి రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. వైరల్ అయిన వార్తకు తగ్గినట్లుగానే ఈయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి , తాగునీటి సరఫరా , పర్యావరణం , అడవులు , సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను అప్పగించారు.

ఇకపోతే ఇది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం లుగా ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ఇక ఈ సారి మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఉప ముఖ్యమంత్రి గా ఉండబోతున్నారు. ఇలా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకూడదు అనే ఉద్దేశం తోనే ఉపముఖ్యమంత్రి పదవిని కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: