ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తన హవాను నడిపించింది. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపడింది. ఇదే తరుణంలో కొద్దికొద్దిగా టిడిపి పార్టీ వెనక్కి తగ్గిపోయింది. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి ఎంతో కొంత క్యాడర్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. అలాంటి ఈ తరుణంలో టిడిపి కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమై అక్కడ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఎన్నికల్లో భారీ మెజారిటీతో టిడిపి పార్టీ గెలుపొందింది. చంద్రబాబు నాయుడు సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. 

ఇదే తరుణంలో ఏపీలో మంచి పట్టుతో నడుస్తున్న టిడిపి తెలంగాణపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఉన్నారట. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులను ఆసరాగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు  తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడింది కాబట్టి  ఆ పార్టీలో ఇదివరకు చేరినటువంటి టిడిపి నాయకులందరినీ మళ్లీ సొంతగూటికి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారట. గర్ వాపసి పేరుతో ఈ చేరికలకు శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది. పాత నాయకులందరికి ఫోన్లు చేసి తెలంగాణలో పార్టీ బలోపెతానికి కృషి చేయాలని సమాచారం అందించారట. దీంతో పాత టిడిపి నాయకులకు సంతోషం అనిపిస్తోందని తెలుస్తోంది. అయితే తెలంగాణలోని టిడిపి నాయకులు అందరిని మూకుమ్మడిగా  బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు కేసీఆర్. ప్రస్తుతం ఆ పార్టీ పూర్తిగా  ఓడిపోయింది.

ఆ పార్టీలో ఉన్నటువంటి పాత టిడిపి నాయకులంతా ఇతర పార్టీల వైపు వెళ్లాలని చూస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు  వారందరికీ ఫోన్లు చేయించి మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం సహాయ సహకారాలు అందిస్తారనే ఆలోచనతో ఉన్నారట. ఈ సందర్భంలోనే కొంతమంది టిడిపి మాజీ నాయకులకు మంగళగిరి నుంచి ఫోన్లు కూడా వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం టిడిపి పాత నాయకులంతా ఏ పార్టీలో ఉన్నారు ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు.. పార్టీలోకి వచ్చేందుకు ఎవరు ఇష్టపడుతున్నారు..అనేదానిపై  టిడిపి అధిష్టానం ఆరా తీస్తుందట. ఈ సమీకరణాల ఆధారంగానే టిడిపిని  తెలంగాణలో కూడా బలపరిచే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: