ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి ఈ పార్టీ  భవిష్యత్తులో ఉండాలి అంటే తప్పనిసరిగా జగన్ ప్రక్షాళన చేయాల్సిందే. ఇంకా అహంకార భావంతో ఉంటే మాత్రం  ఇక రాబోవు 2029 ఎలక్షన్స్ వరకు ఈ పార్టీ పూర్తిగా ప్రజల్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి  ఎన్నికలకు ముందు ఈ మూడు అంశాలు మిస్ అయ్యారు. దీనివల్ల విపరీతమైన ఓటమి వచ్చిందని కొంతమంది సీనియర్లు చెబుతున్నారు. జగన్ ఓటమికి గల కారణాలేంటి భవిష్యత్తులో ముందుకు వెళ్లాల్సినటువంటి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఈ మూడు అంశాల గురించి ఎవరు చెప్పబోతున్నారు. ఆ మూడు అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇందులో మొదటి అంశం ఏమిటంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అస్సలు పట్టించుకోలేదు. ప్రభుత్వం పార్టీ అయింది పార్టీ ప్రభుత్వం అయిపోయింది. దీనివల్ల కింది స్థాయి కార్యకర్తలకు చాలా ఇబ్బందులు వచ్చాయి. గ్రౌండ్ లెవెల్ లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి గొడవలు జరిగాయి. కొత్త అభ్యర్థులను పెట్టడం వల్ల అభ్యర్థులకు మరియు కిందిస్థాయి కార్యకర్తలకు అస్సలు కుదరలేదు. ఇక రెండో అంశము విషయానికొస్తే..చాలామంది కిందిస్థాయి కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు. 2009 నుంచి పార్టీని వారి భుజాలపై మోసుకు వస్తున్నారు. అలాంటి కార్యకర్తలకు ఆర్థికంగా సహకారం అందించాలి. ఇప్పటికీ గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు.

మరి ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్లో వీరు ఎలా పోటీ చేస్తారు వారి దగ్గర డబ్బులు ఏవిధంగా ఉంటాయి. దీనివల్ల కూడా చాలా మంది సర్పంచ్లు,ఎంపీటీసీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి వీరిని ఎవరు ఆదుకోవాలి. ఇక మూడో విషయానికి వస్తే.. జగన్ ఇల్లును వదిలి జనంలోకి రావాలి. ఎవరైతే గాయపడి బాధపడి హాస్పిటల్ పాలయ్యారో వారి పరిస్థితి ఏంటి అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. వెళ్లకుంటే పార్టీని కార్యకర్తలు నమ్మరు. 2029 వరకు పార్టీ ని ఎలా మోస్తారు. ఈ విషయాలన్నీ సమీక్షా సమావేశంలో జగన్ కు తప్పక తెలియజేయాలి.కానీ ఈ మూడు అంశాలను జగన్ కు ఎవరు తెలియజేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: