కొవిడ్ తరువాత యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో పెను మార్పులే సంభవించాయి. సగటు సినిమా ప్రేక్షకుల అభిరుచితో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినప్పటికీ అది బావుంటేనే థియేటర్లకు వెళ్తున్నారు... లేదంటే లేదు. ఇక చిన్న తరహా సినిమాల గురించి అందరికీ తెలిసిందే. వాటికి థియేటర్లు దొరకడమే ఎక్కువ. ఈ తరుణంలో పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినపుడు టికెట్ రేట్లను పెంచి అమ్మితేగాని నిర్మాతకుగానీ, డిస్ట్రిబ్యూటర్లకు గానీ పెద్దగా గిట్టుబాటు అవ్వడంలేదు. అందుకనే అడపా దడపా టికెట్ రేట్లను పెంచుతారు.. దానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పచ్చ జెండా ఉపేవి.

కానీ గత ప్రభుత్వం వైసీపీ హయాంలో మాత్రం చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పుకోవాలి. టికెట్ రేట్ల సంగతి పక్కన బెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను అడ్డుకొనే పరిస్థితి దాపురించింది. ఆయా పరిణామాల మధ్య మెగాస్టార్ మొదలుకొని... ప్రభాస్, మహేష్ బాబు వంటివారు నాటి సీఎం జగన్ ని కలిసి వారి గోడు వినిపించుకున్నా ఆయన కరుణించకపోగా వారిని అవమానపరిచి వెళ్లగొట్టిన పరిస్థితి. అయితే ఇపుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఓడించి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో టాలీవుడ్ ఆశలు చిగురించాయి.

టీడీపీ ప్లస్ జనసేన కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం కావడంతో టీడీపీ టాలీవుడ్ కి ఫేవర్ గానే ఉంటుంది అని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు ఇక్కడ జనసేన నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కోరికలు ఏమిటి? చంద్రబాబు ఏమి ఇవ్వగలరు? అనే అంశాలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక నుండి టాలీవుడ్ కి ఏమి చేయాలన్నా... టికెట్లు ధరలు పెంచడం నుండి చిన్నకారు సినిమాలను ఎంకరేజ్ చేయడం వరకు ఏపీ సర్కార్ అన్నింటికీ అండదండగా ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా ఏపీలో షూటింగులు ఎక్కువగా చేసుకుంటే పన్ను రాయితీలు ఇవ్వడం అన్నది మరో వెసులుబాటుగా మారబోతుంది. ఎందుకంటే ఏపీలోనే ఎక్కువగా షూటింగులు జరుగుతాయి. వీలైనంతవరకూ ఏపీలో షూటింగులు జరిగితే సినీ కళ కచ్చితంగా కనిపిస్తుంది అనేది మాత్రం వాస్తవం. ఇక రాబోయే రోజులన్నీ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి రోజులనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: