గత ప్రభుత్వ హయాంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించిన వ్యక్తులే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)లో ఉన్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏసీఏను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జేసీ కుటుంబంలోని ఓ సభ్యుడు తెరపైకి వస్తారని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంలో తలెత్తిన అనేక సమస్యలు ఇప్పుడు సాల్వ్ అవుతున్నాయి. ఈ ప్రక్షాళనలో భాగంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఈ స్థానానికి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంది.వాస్తవం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏసీఏ కార్యవర్గం మొత్తం రాజీనామా చేసింది. అయితే ఆగస్టు నాలుగో తేదీన జరిగే సమావేశంలో వీరి రాజీనామాలపై ఆమోద ముద్ర వేస్తారు. ఏసీఏ అధ్యక్ష పదవికి పలువురి పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ జేసీ పవన్‌రెడ్డిని ఖరారు చేసినట్లు సమాచారం.

జేసీ పవన్ రెడ్డికి అంతర్జాతీయ క్రికెటర్లతో మంచి స్నేహబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కనెక్షన్‌ల ఫోటోలు సంచలనం సృష్టిస్తాయని భావిస్తున్నారు.  అతను మహేంద్ర సింగ్ ధోనీతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ కలిగి ఉన్నాడని, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా తెలుసు అని చెబుతున్నారు. అయితే జేసీ పవన్ రెడ్డి తర్వాత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ నేతలతో ప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. జేసీ పవన్ సీరియస్ గా ప్రయత్నిస్తే ఈ రోల్ కు ఫైనలయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. జేసీ పవన్ రెడ్డికి మంచి స్థానం కల్పించాలని బాబు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే ఏసీఏ ప్రెసిడెంట్ పాత్రకు పవన్ పేరే ఫైనలైజ్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: