- వైసీపీ ఓడగానే అక్రమాలు బయటకు..
- సాయిరెడ్డిని ఇరికించడానికి శాంతిని బలిచేశారా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పడానికి ప్రధాన న్యాయాసనం రాజకీయ నాయకులే. ఒక వర్గం ఓడిపోయింది అంటే మరో వర్గం సంబరాలు చేసుకుంటుంది. అంతేకాదు వారి ఆపోజిట్ వర్గంపై దాడులకు కూడా దిగడానికి ఏమాత్రం వెనకూడదు. అలా ఏపీలో ఎప్పుడు కూడా కుల మత ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. టిడిపి నాయకులు గెలిస్తే వైసీపీలో ఉన్న నాయకులు చాలామంది సైలెంట్ అయిపోయి ఎక్కువగా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అదే వైసీపీ గెలిస్తే టిడిపి నాయకులు సైలెంట్ అయిపోయి ఉంటారు. ఇలా ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఓడిపోయిన పార్టీపై తప్పక రివేంజ్ తీర్చుకోవడం అనేది ఎక్కువగా ఏపీ రాజకీయాల్లోనే చూస్తూ ఉంటాం.
విజయసాయిరెడ్డిపై రివేంజ్.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ నమ్మిన బంటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అక్రమాలు చేశారని భూదందాలు చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ కూడా కొనసాగుతోంది. ఇదిలా కొనసాగుతున్న తరుణంలోనే విజయసాయిరెడ్డి,శాంతి వ్యవహారం బయటకు వచ్చింది. విజయ సాయి రెడ్డి వల్లే శాంతి గర్బం దాల్చిందని ఆమె భర్త మదన్మోహన్ ఆరోపణ చేశారు. దీంతో ఈ వ్యవహారం చాలా కీలకంగా మారింది. ఈ తరుణంలోనే విజయ్ సాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలామందిని తిట్టారు. ఇదంతా కావాలని టిడిపి నాయకులు కొంతమంది కలిసి చేయిస్తున్నారని అన్నారు. అయితే ఈ వ్యవహారానికి టిడిపి నాయకులు రాజకీయ రంగు పులిమి చివరికి దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి బ్రతుకును రోడ్డున పడేశారు. ఇలా బడా నాయకుల మధ్యలో శాంతి బలవడం దారుణం. ఆమె విజయ్ సాయి రెడ్డి తో తప్పు చేసిందా చేయలేదా అనేది పక్కన పెడితే రాజకీయ అవసరాల కోసం మాత్రం శాంతి జీవితాన్ని రోడ్డుకీడ్చారు. ఈ విధంగా చాలామంది రాజకీయ నాయకుల కోసం ఇలా కొంతమంది కార్యకర్తలు, మహిళా ఉద్యోగులు బలవ్వడం దారుణమైన విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.