ఏపీలో వైఎస్ ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి ఎప్పుడూ రాజకీయ యుద్ధం సాగుతుండేది. ఇప్పుడు షర్మిల కూడా జగన్ కు వ్యతిరేకంగా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు నారా ఫ్యామిలీని షర్మిల ఎన్నో మాటలు అంది. 2019లో అ ఆలు రాని వారు అగ్రతాంబూలం తనకే కావాలన్నడట అనే కొటేషన్ కూడా వాడింది. నారా లోకేష్‌ను నానా రకాలుగా విమర్శించింది. ఆయనపై ఎన్నో సెటైర్లు వేసింది. ఘాటైన విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు అంతా తలకిందులైపోయింది. తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి బాబు ఇంటికి వెళ్లిన షర్మిల చాలా సేపు అక్కడ మాట్లాడారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. దానిని వైసీపీ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.
రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అని షర్మిలకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. జగన్ ని మరోసారి జైలులో ఉంచుతారనే విషయం గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా ఇండిపెండెన్స్ డే రోజు ఎట్ హోం పార్టీకి కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల వెల్లారు. అక్కడ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ ఎంతో ఆప్యాయంగా షర్మిలను పలకరించారు. వారిద్దరూ చాలాసేపు అన్నా చెల్లి అని మాట్లాడుకున్నారు. దీంతో అన్నాచెల్లి అంటే వీరేనని మీడియా కూడా బాగా ప్రొజెక్ట్ చేసింది. అయితే మరో మూడు రోజుల్లో రాఖీ పండగ ఉంది. ఈ సమయంలో అన్నగా లోకేష్ కే షర్మిల రాఖీ కడుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే షర్మిల నారా కుటుంబంతో కలిసి ఉండటాన్ని వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి