చివరకు చంద్రబాబు .. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను బలవంతంగా తమ వైపునకు తిప్పుకోవడానికి ఇష్టపడలేదు. అలా బొత్స గెలుపు సులువు అయింది. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు ఐదేళ్ల మంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ నేతగా ఉన్న తనను జగన్ పట్టించుకోకపోవడం బొత్స ను ఎంతో మరోవేదనకు గురిచేసిందట. పైగా ఎన్నికలలో బొత్స కు ఇష్టం లేకపోయినా బొత్స భార్య ఝాన్సీ ని బలవంతంగా విశాఖ ఎంపీగా పోటీ చేయించారు. ఝాన్సీ ఏకంగా 5 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు బొత్స ఎమ్మెల్సీ అయ్యారు.. బొత్సకు ఎలాగో మరో మూడేళ్ల పాటు ఎమ్మెల్సీ ఉంటుంది. వైసీపీలో ఉండటం కంటే బిజెపిలోకి వెళితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడా బొత్స చేస్తున్నారని బొత్స సన్నిహితుల ద్వారా ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చిందని తెలుస్తోంది. బొత్స పార్టీ మారి బిజెపిలోకి వెళితే ? ఆయనని ఎంతో కష్టపడి గెలిపించిన జగన్కు పెద్ద షాక్ లాంటిదే అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి