ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ ఎన్నికలు ఇప్పటికి ఇప్పుడు వస్తే.. ఎవరు గెలుస్తారనే విషయంపై చాలామంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నికలు జరిగి కేవలం నాలుగు నెలలు కావస్తూ ఉన్న.. కూటమి ప్రభుత్వం ఎన్నో చెబుతూ ఉన్న కానీ సామాన్యుల ఆలోచన మరొక లాగా ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వైసిపి పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కచ్చితంగా సంక్షేమ పథకాలు అందేవని చాలామంది ప్రజలు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఇటీవల ఒక ఆన్లైన్ ఛానల్ నిర్వహించిన సర్వేలో పలు విస్తీ పోయి నిజాలు వచ్చాయట.


అమ్మబడి, రైతు భరోసా, విద్యా కానుక ,ఆసరా వంటి కీలకమైన పథకాలు ఎక్కువగా  ప్రజలలోకి వెళ్లాయట. కూతమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ రెండింతల రెట్టింపుతో ఇస్తామని చెప్పిన ఇప్పటికే గడిచిన వంద రోజుల తర్వాత అయినా కూడా ఎలాంటి విషయాలపైన క్లారిటీ ఇవ్వలేదు సీఎం చంద్రబాబు. కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అధికారులను మార్చడమే తప్ప మరేమీ చేయలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కొత్త పింఛన్ల వ్యవహారాలను కూడా పట్టించుకోవడంలేదని సూపర్ సిక్స్ హామీలను ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పైన పెదవి విరుస్తున్నారట.


ముఖ్యంగా మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆడబిడ్డ నిధి రైతు భరోసాలకు ఇస్తానన్న డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక వైసిపి పార్టీలోని నేతలు కూడా అధికారం లేదని ఇతర పార్టీలవైపు మగ్గుచూపుతున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇటీవల వరదల వల్ల కూడా ఎన్నో వేల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వీటికి ఇస్తామన్న నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పాటు చాలామంది కూటమి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో అసంతృప్తితో వ్యతిరేకిస్తున్నారట. చంద్రబాబు వ్యక్తిగతంగా చూస్తే గతంలో ఉన్న ఇమేజ్ కాస్త తగ్గిందని..డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థను మాత్రమే బలోపేతం చేసేలా ప్లాన్ చేస్తున్నారని ఇతర విషయాలలో స్పందించలేదని కూడా కార్యకర్తలు వాపోతున్నారు.164 మంది ఎమ్మెల్యేలు కూటమికి దక్కిన ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరుగుతే 100 లోపే ఉంటుందని మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా ప్రజలలో కనిపించడం లేదట. మరి ఇకనైనా ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: