ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం మరికాసేపట్లోనే జరగనుంది. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీలోని కూటమి నేతలు , తదితరులు అందరూ... ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.... అమరావతి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు.  వాస్తవానికి ఈ కార్యక్రమానికి రావాలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపింది కూటమి ప్రభుత్వం. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాత్రి బెంగళూరుకు వెళ్లిపోయారు.  ఈ నేపథ్యంలో కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా... అమరావతి రాజధానిని తీవ్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అమరావతి కాకుండా మూడు  రాజధానులు ఉండాలని... వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించారు. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూడు రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి మొండిపట్టు పట్టడంతో... అక్కడ ఉన్న రైతులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా చేశారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు రైతులందరూ ఉద్యమం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలైన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతికి శంకుస్థాపన చేస్తున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: