
అలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లు పెంచేందుకు సంకేతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.. అయితే అసెంబ్లీ సీట్లు విభజన చట్టంలో అమర్చిన మేరకు ప్రస్తుతమున్న 175 స్థానాలను 225 స్థానాలకు పెంచే అవకాశం ఉన్నదట. తెలంగాణలో అయితే 119 నుంచి 154 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రాలో 50 సీట్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే సీట్ల పెంపు 2029 ఎన్నికలలోపు ఉంటుందనే విధంగా అధికారులు లెక్కలు వేస్తున్నారు.
2009లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగింది. అప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా మారిందట. అలా రాజశేఖర్ రెడ్డి సీఎంగా కలిసొచ్చింది. అయితే ఇప్పుడు 2029 ఎన్నికల ముందు సీట్లు పెరిగితే కూటమి ప్రభుత్వానికి ప్లస్ అవుతుందని ఆ నేతలు భావిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇలాంటి మాటలు కేవలం కూటమిగా ఉన్నంతవరకే చెల్లుతాయి. ఒకవేళ కూటమి నుంచి బయటికి వస్తే పరిస్థితి ఏంటి అన్నట్లుగా చాలామంది కూటమి నేతలు ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రజలలో వ్యతిరేకత అనేది ఉంది అంటూ చాలామంది నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. సీట్ల పెంపు కూటమిలో ఉండే పార్టీలకు సీట్లు ఎక్కువగా కేటాయించడానికి ఉపయోగపడుతుంది.. గతంలో కూడా సీట్ కోసం తమ స్థానాలను వదులుకున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. కానీ సీనియర్ నాయకుడు యనమల మాత్రం 2029 లోపు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ధీమాని తెలియజేస్తున్నారు. ఒకవేళ అలా పెరగకపోతే కూటమికి ఇబ్బందులు తప్పవని చర్చ కూడా ఇప్పుడు మొదలవుతున్నదట. మరి సీట్లు పెరిగితే కూటమికి కలిసొస్తుందా వైసిపి పార్టీకి కలిసొస్తుందో చూడాలి మరి.