2014 వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గానే ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలుగా ఆవిర్భవించింది. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 23 జిల్లాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి టి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 10 జిల్లాలు ఉండేవి. ఆ తర్వాత కేసీఆర్ జిల్లాలను ఒక్క సారిగా భారీ ఎత్తున పెంచేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జిల్లాల సంఖ్యను పెంచలేదు. అలాగే వాటికి సంబంధించిన ఏ మార్పులు కూడా చేయలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై సి పి పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఇక ఆ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాలను పెంచారు. అందులో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాల విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా చంద్రబాబు జిల్లాల విషయంలో కొత్త ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సారి చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమైనా జిల్లాలను తీసుకువస్తాడా ..? లేక పాత జిల్లాల సరిహద్దులను మారుస్తాడా ..? ఇలా అనేక ప్రశ్నలు జనాల్లో రేకెత్తుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఈ సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను తీసుకువస్తాడా ..? ఉన్న జిల్లాల సరిహద్దులను మారుస్తాడా ..? లేక మరేదైనా సరికొత్త విధానాన్ని తీసుకొస్తాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap