రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఏ పార్టీ అధికారం కోల్పోవాలన్నా ఉద్యోగుల పాత్ర కీలకమనే సంగతి తెలిసిందే. 2019లో జగన్ పక్షాన నిలబడిన ఉద్యోగులు 2024లో మాత్రం చంద్రబాబు పక్షాన నిలబడ్డారు. ఉద్యోగులు తలచుకుంటే ఎన్నికల ఫలితాలను అటూఇటూ మార్చేయగలరని కూడా చాలామంది ఫీలవుతారు. అయితే బాబు పాలాన గురించి ఉద్యోగులు ఎలా ఫీలవుతున్నారో జగన్ తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబును ఎందుకు సీఎం చేశామా అని ఉద్యోగులు భావిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఈరోజు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని జగన్ నిర్వహించగా ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన పాలన ద్వారా బాబు ఉద్యోగులలో విషం నింపారని ఒక్కరికి కూడా ఐఆర్ ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. మూడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
 
పీఆర్సీ సైతం ఉద్యోగులకు ఇవ్వలేదని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సత్తా ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని జగన్ కామెంట్లు చేశారు. మహానాడులో బాబు షో చేస్తున్నారని తనను తిట్టడం సత్తా ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించడం కొసమెరుపు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
కూటమి సర్కార్ పాలన అరాచక పాలన అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో సైతం ఇబ్బందులు ఎదురైనా వాటిని మనం సాకుగా చూపలేదని జగన్ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని జగన్ కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైసీపీ పుంజుకునే ఛాన్స్ ఉందేమో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: