
అయితే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఆ ఒక్క సంఘటన కాస్త ముందు జరిగి ఉంటే అందరి ప్రాణాలు నిలిచేవని వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో లండన్ ఇతర దేశాలకు వెళ్లేటువంటి ఫ్లైట్లను ఎయిర్ ఇండియా ఈ రోజున రీ షెడ్యూల్ చేసింది.. అయితే ఈ దాడులు ఒక్కరోజు ముందు జరిగే ఉంటే ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యేవని దీంతో వందలాది మంది మరణించేవారు కాదని అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కొంతమంది విధి అంటే ఇదే చావు ఎక్కడ ఉన్నా కూడా తప్పించుకోలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కానీ విమాన ప్రమాదం జరగడానికి చాలా కారణాలు ఉన్నాయనే విధంగా చాలామంది విశ్లేషకులు తెలుపుతున్నారు. ముఖ్యంగా విమానం గేరు రాడు మూసుకుపోలేదని దీనికి తోడు రెక్కల వెనుక భాగంలో ముడుచుకుపోయి ఉన్నదని అందుకే ఈ ప్రమాదం జరిగిందంటూ తెలుపుతున్నారు. అంతేకాకుండా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు టేకఫ్ సమయంలో చాలా ప్రమాదం జరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. మరి కొంతమంది పక్షులు ఢీకొని రెండు ఇంజన్లలో శక్తి కోల్పోయేలా చేసి ఉంటాయని అందుకే టేక్ ఆఫ్ అనంతరం వేగాన్ని అందుకోలేకపోయిందంటూ నిపుణులు తెలుపుతున్నారు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అసలు విషయాన్ని అధికారులు బయటపెడతారేమో చూడాలి.