కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఈసారి చాలా ప్రయోగం చేశారు. యువకులకు .. తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే 2019 - 2024 మధ్య ఐదేళ్లపాటు వైకాపా అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన వారికి అవకాశం ఇచ్చారు. కానీ తొలిసారి మంత్రులుగా అవకాశం వచ్చిన వారు కష్టపడి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. ఒకరిద్దరు మినహా అందరూ కూడా పార్టీ ప్రయోజనాలు ... ప్రభుత్వ ప్రయోజనాలు పక్కన పెట్టి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న వాతావరణ స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు సీనియర్ మంత్రులు మళ్లీ అవకాశం వస్తుందో రాదో ? అన్నట్టుగా స్వార్థ ప్రయోజనాలపై బాగా దృష్టి పెడుతూ ఉండగా కొందరు జూనియర్ మంత్రులు ఏడాది గడిచినా ఇంకా గాడిలో పడలేదు. తమ శాఖలపై ఇంకా వారికి పట్టు చిక్కలేదు. మంత్రులు .. పార్టీ ఎమ్మెల్యేలు కీలక పదవుల్లో ఉన్నవారు సమష్టిగా కీలకమైన సమయాలలో బాధ్యత తీసుకోవడంలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం పై విపక్షాలు అసత్య ఆరోపణలు చేసినప్పుడు వెంటనే తిప్పికొట్టే ప్రయత్నం ఏమాత్రం జరగటం లేదు.
చాలామంది మంత్రులు సైలెంట్ గా ఉంటున్నారు. ఉదాహరణకు ఉర్సా కు భూకేటాయింపు వ్యవహారమే దానికి నిదర్శనం. ఆ సంస్థకు విశాఖలో ఐటీ హిల్స్ పై ఎకరం కోటి రూపాయలు చొప్పున ... కాపు లుప్పాడలో ఎకరం 50 లక్షలు చొప్పున భూములు కేటాయించారు. కానీ ఎకరం 99 పైసలకే ఇచ్చినట్టు వైసిపి దుష్ప్రచారం చేసింది .ప్రభుత్వం .. పార్టీ నుంచి ఐదు రోజుల వరకు దానిని తిప్పికొట్టే ప్రయత్నమే జరగట్లేదు. ముఖ్యనేత ఒకరు జోక్యం చేసుకుని క్లాస్ తీసుకున్నాకే మంత్రుల నాయకులు దానిపై స్పందించారు. అసలు చాలామంది మంత్రులు అయితే పూర్తిగా సంపాదనలో మునిగిపోయి తమ నియోజకవర్గం ప్రభుత్వం పార్టీని చివరకు తమ గెలుపు కోసం యేళ్లకు యేళ్లుగా కష్టపడుతున్న వారిని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి మారకపోతే పార్టీ మైనస్ లోకి వెళ్లి పోవడం ఖాయం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు