- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకుల వ్యవహారశాలి ఎలా ? ఉంది ఏ ఏ ప్రాంతాల్లో నాయకులు ఎలా పని చేస్తున్నారన్న ? చర్చ జోరుగా సాగుతుంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో కూటమి నాయకుల పనితీరు ఎలా ఉన్నా ? అత్యధిక సీట్లు దక్కించుకున్న రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వీరి పై చర్చ జరుగుతుంది. వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో కూడా కూటమి విజయం దక్కించుకుంది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 45 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. కేవలం ఏడు చోట్ల మాత్రమే వైసిపి విజయం సాధించింది. 2019 ఎన్నిక‌ల‌లో కేవలం మూడు చోట్ల మాత్రమే టిడిపి విజయం సాధించగా .. 2024 ఎన్నికల వచ్చేసరికి కూటమి భారీగా పెంచుకుంది. వైసీపీకి కీలకమైన అనేక నియోజకవర్గాలలో మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో కూడా కూటమి గెలుపు గుర్రం ఎక్కింది.


ఈ ఏడాది కాలంలో ఇక్కడ నాయకుల పనితీరు ఎలా ఉంది ? ఏం చేస్తున్నారు అన్నది చూస్తే కడపలో నాయకుల మధ్య సఖ్యత కొరవ‌డింది. కర్నూలు - అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి బాగానే ఉన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో పరిస్థితి అదుపుతప్పింది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. గత ఎన్నికలలో ప్రాధాన్యం లేకుండా పోయిందని చాలామంది నాయకులు .. కార్యకర్తలు వాపోతున్నారు. దాదాపు 20 కి పైగా నియోజకవర్గాలలో కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే తీరు కొనసాగితే మరో ఏడాదికే రాయలసీమ జిల్లాల్లో వైసిపి భారీగా పుంజుకోవడం ఖాయం అన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: