
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, డ్రగ్స్ సమస్య తీవ్రత గురించి పోలీసులు తనకు వివరించారని, ఆరోగ్యం క్షీణిస్తే సంపాదన వృథా అవుతుందని అన్నారు. కొన్ని దేశాలు యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి శత్రు దేశాలను బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి డ్రగ్స్ ప్రయత్నించమని ప్రలోభపెట్టే వారి నుంచి దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చడంలోనే నిజమైన సంతోషం ఉంటుందని ఆయన సూచించారు.
రాంచరణ్ మాట్లాడుతూ, యువతకు డ్రగ్స్ నష్టాలపై అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లలో మత్తు పదార్థాలు కలపడం దారుణమని, ఇలాంటి వాటి కోసం తల్లిదండ్రులు భయపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం, స్నేహితులతో గడపడం జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం యువతలో డ్రగ్స్‌పై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించింది. రాంచరణ్, విజయ్ వ్యాఖ్యలు సమాజంలో చైతచన్యాన్ని రేకెత్తించాయి. డ్రగ్స్ నిరోధక చర్యలకు ప్రభుత్వం, ప్రజలు కలిసి సహకరించాలని రాంచరణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు