- ( గుంటూరు - ఇండియా హెరాల్డ్ ) . . .

రాజకీయంగా ఇప్పటికే ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న తనకు గుంటూరు చివరి మజిలీ అని వైసిపి సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఇటీవల ఆయనను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ జగన్ నియమించిన సంగతి తెలిసిందే. వైసిపి ఆవిర్భావం నుంచి ఆయన సత్తెనపల్లిలో రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. 2014 - 2019 - 2024 ఇలా మూడు ఎన్నికలలో ఆయన వైసీపీ తరఫున సత్తెనపల్లిలో పోటీ చేశారు. 2019లో విజయం సాధించి రెండుసార్లు ఓడిపోయారు. గత ఎన్నికలలో ఆయన మంత్రిగా ఉండి టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడంతో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రేపల్లెలో తన రాజకీయ ప్రస్థానం మొదలైందని సత్తెనపల్లి వరకు వెళ్లి ఇప్పుడు గుంటూరుకు చేరిందని తెలిపారు.


ఇదే తన చివరి మజిలీ అని తెలిపారు. ఏడు ప‌దుల‌ వయసుకు చేరుకుంటున్న అని రాజకీయంగా విశ్రాంతి ద‌శ‌కు చేరుకున్నట్టు అంబటి తెలిపారు. అందుకే చివరి మజిలీ గుంటూరు తో ముగిస్తానని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇదే తనకు చివరి అవకాశం అనే వైయస్ జగన్ గుంటూరు వెస్ట్ సీటు ఇచ్చారని భావిస్తున్నట్టు అంబటి తెలిపారు. ఈ క్రమంలోనే వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఒకప్పుడు ఎన్ఎస్ఏఐ నాయకుడిగా రేపల్లెకు వచ్చిన సందర్భంలో ఆయనను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగానని .. అయితే తన వ్యతిరేక వర్గంతో తనను కలవకుండా వెళ్ళిపోయారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో నవ్వులు పూసాయి. అనంతరం అప్పిరెడ్డి తాను కలిసి అంచలంచలుగా ఎదుగుతూ కలిసి పనిచేసేమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరం వైసీపీలోకి వచ్చి చేర‌టాన్ని ఆయన గుర్తు చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: