
ఆ మార్కెట్ యార్డులోకి 500 మంది వెళ్లొచ్చు.. కానీ వెనకాల వచ్చేస్తూ ఉంటారు. ఎవరు ఆపుతారు? ఎలా ఆపుతారు? జనాలు చూడటానికి వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? ఎలా ఆపుతారు.. జగన్ వెనకాల వెళ్ళేది కేవలం 50 మంది నాయకులు కాదు మిగతా వాళ్లంతా కూడా ప్రజలే ఉంటారు. ఒకవేళ పెద్ద నాయకులైతే మరో 50 మంది. కింద స్థాయిలో నాయకులతో సహా మొత్తం మీద 500 మంది అనుమతిచ్చారు.. కానీ చూడడానికి వచ్చేవాళ్లను ఎవరు ఆపుతారు? ఎలా ఆపుతారు?. ఈ కండిషన్స్ అనేటివి వర్తిస్తాయా లేదా ఇది చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్ కో ఇలాంటి కండిషన్స్ పెడితే ఒప్పుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
గతంలో కూడా ఇలాంటి కండిషన్ పెడితే ఒప్పుకొని ఉండేవాళ్ళ.. ఇప్పుడు ఒప్పుకుంటారా? అయితే గతంలో ఇలాంటి కండిషన్స్ మీద అరాచకం చేస్తున్న అంటే అహంకారంతో ప్రవర్తిస్తున్నావని.. నీ అధికారాన్ని అణచివేస్తామంటూ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు.. అయితే ఇప్పుడు ప్రభుత్వమే ఈ పని చేస్తోంది.. మరి ఆనాడు ప్రభుత్వం కూడా అహంకారంతో ప్రవర్తిస్తే ఇప్పుడు బాధ్యతతో ప్రవర్తిస్తున్నట్ట అంటూ ప్రభుత్వాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు.. ఒక నాయకుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ తో ఏర్పాటు చేసి భద్రతగా వారిని ఉండేలా చూసుకోవాలి. కానీ వాటన్నిటిని మానేసి కేవలం 30 మంది వస్తేనే ఇస్తాము.. 500 మందికి అనుమతి ఇస్తామంటూ ఆంక్షలు పెట్టడం కరెక్టేనా అంటూ చాలామంది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యాడికి 2 కిలోమీటర్లు ఉంటుంది.. మధ్యలో ఎవరూ కూడా జగన్ కలవడానికి రాకూడదు జగన్ కలవకూడదని, ప్రజలను చూసి చేయి ఊపకూడదనే కండిషన్స్ పెడుతున్నారు. జగన్ బయటికి రావడానికి వీలు లేదు అంటే సాధ్యమవుతుందా? జగన్ ప్రజలను దూరం చేయడం సాధ్యమేనా అంటే చాలామంది ప్రశ్నిస్తున్నారు.