
నాగపూర్‌కు చెందిన దివ్య, చిన్నతనం నుంచే చదరంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆమె ఆటలో దూకుడుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీలలో పతకాలు గెలుచుకుంది. ఆమె ఆట కేవలం వ్యూహాత్మకంగా మాత్రమే కాదు క్రియేటివ్ గా కూడా ఉండటం ఆమెకు ప్లస్ అయింది. ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచే ఎత్తులతో విజయాలు సాధించడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.
FIDE మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపితో దివ్య తలపడగా ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని దివ్య ఈ పోటీలో విజయం సాధించింది. మన దేశం పేరుప్రతిష్టలను తన ప్రతిభతో దివ్య మరింత పెంచిందని చెప్పఁడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
దివ్య దేశ్ ముఖ్ విజయం యువ క్రీడాకారులకు ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తి అని చెప్పవచ్చు. భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఈమె ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. ఆమె సాధించిన ఈ విజయం చదరంగంపై మరింత మందికి ఆసక్తిని పెంచుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. . దివ్య సాధించిన ఈ విజయం ఆమె కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి అని చెప్పవచ్చు. . భవిష్యత్తులో ఆమె ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని ఆశిద్దాం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు