
గండికోట దృశ్యం చూసినవాళ్లెవ్వరికైనా ఇది నలుగురిలో చెప్పుకోదగ్గ అనుభవం అవుతుంది. దాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని బాబు తలపడ్డారు. ఈ ప్రాంతాన్ని టూరిజం మెప్పే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సహాయ నిధి (SASCI) కింద రూ.78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ వంటి పెద్ద సంస్థలు ఏపీ టూరిజం కార్పొరేషన్‌తో కలసి రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేయడం విశేషం. గండికోట, శ్రీశైలం, తిరుపతి, మంత్రాలయం వంటి ప్రాంతాల్లో హైరోప్, జెట్ స్కీయింగ్, కయాకింగ్, అడ్వెంచర్ క్రీడలతో పాటు స్టార్ హోటళ్ల నిర్మాణం చేయాలని ఈ ఒప్పందాల ఉద్దేశ్యం.
అంతేకాదు, చంద్రబాబు పర్యటనలో భాగంగా అక్కడి పర్యాటకులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మరోవైపు, పారిశ్రామికంగా సీమ అభివృద్ధి కోసం స్పెషల్ డ్రాఫ్ట్ రెడీ చేసామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో పాటు రాష్ట్రం తరపున రూ.5 వేలు కలిపి రూ.7 వేల ఆర్థిక సాయం కూడా ఇవ్వనున్నట్టు శనివారం వెల్లడించారు. చివరగా చెప్పాల్సిందే – టూరిజం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి... మూడు వైపులా దూసుకెళ్తున్న చంద్రబాబు పాలనకు ఇది జారుతున్న రోలర్ కాస్టర్ కాదు, దూసుకెళ్తున్న ఎక్స్‌ప్రెస్!