ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరాలని అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలని పెట్టుబడులే లక్ష్యంగా  సింగపూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం చేసిన తప్పులను  సరిదిద్దడానికి తాను  సింగపూర్ కు వచ్చానని  సింగపూర్ లో 40,000 మంది తెలుగు వాళ్ళు నివశిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.  ఒక వ్యక్తి ఫౌండేషన్ వల్ల సింగపూర్  గౌరవప్రదమైన దేశంగా ఎదిగిందని అమరావతి మాస్టర్ ప్లాన్ ను సైతం సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అయితే చంద్రబాబు సింగపూర్ పర్యటన ద్వారా ఈ ఏడాది నవంబర్ నెలలో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారని సమాచారం. రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే  దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది.  మరి ఇతర కంపెనీలు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టడం సాధ్యమేనా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో  కష్టపడుతుండగా ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి  ప్రత్యక్షంగా,  పరోక్షంగా ఎంతో  మేలు చేస్తాయని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ లెవెల్ ప్రణాళికలతో ముందుకెళ్తే మంచిదని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నారు.   కూటమి సర్కార్ కు చాలా విషయాలలో లక్  కూడా కలిసొస్తుండటం ఒక విధంగా ప్లస్ అవుతోందని చెప్పవచ్చు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: