
“పనితీరు బాగుంటేనే 2029లో మళ్లీ టికెట్” అని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చేశారు. పవన్ కూడా సీరియస్ మోడ్‌లో .. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, 15 నెలలుగా ఎమ్మెల్యేల పనితీరు రివ్యూ పెద్దగా జరగలేదని అనేక వర్గాల విమర్శలు ఉన్నాయి. తాజాగా పోలవరం ఎమ్మెల్యేపై వచ్చిన ఆడియో టేప్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. స్థానికంగా మరికొందరిపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కూడా ఆగ్రహంతో, త్వరలోనే తన ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని టాక్. పనితీరు సరిగ్గా లేని వారిపై సీరియస్ క్లాస్ తప్పదట. మిత్రులకు బాబు మాస్టర్ ప్లాన్ .. తాజా మంత్రివర్గ సమావేశంలో కూడా బాబు జనసేన, బీజేపీ నేతలకు క్లియర్ మెసేజ్ ఇచ్చారట ..
“ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు రివ్యూ చేయండి, ప్రోగ్రెస్ రిపోర్టులు రెడీ ఉంచండి. 2029 కోసం ఇప్పుడే యాక్షన్ మొదలుపెట్టాలి.” ఈ సూచనలతో మిత్రపార్టీలు కూడా గేర్ మార్చేశాయి. 2029లో మరో దుమ్మురేపే కూటమి? .. బాబు లక్ష్యం స్పష్టంగా ఉంది – కూటమి ఏకతాటిపై ముందుకు సాగి వైసీపీని మళ్లీ అధికారానికి దూరం పెట్టడం. అందుకోసం తన పార్టీతో పాటు మిత్రపార్టీలు కూడా ప్రజల మధ్య దూకుడు చూపాలని ప్లాన్. 2024లో విజయాన్ని సెమీఫైనల్‌గా తీసుకున్న బాబు & పవన్, 2029లో మళ్లీ ఏపీలో పూర్తి క్లీన్ స్వీప్ చేయాలని పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ ఇద్దరి దూకుడు చూస్తుంటే, వచ్చే ఐదేళ్లపాటు ఏపీలో రాజకీయ రంగం మరింత హై వోల్టేజ్‌గా మారడం ఖాయం!